AP Rains: నేడు బలహీనపడనున్న అల్పపీడనం..ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Update: 2024-12-25 03:02 GMT

AP Rains: నైరుతి, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమద్రోణి అల్పపీడనాన్ని , తనవైపు లాగేందుకు ప్రయత్నిస్తోందని వాతావరణశాఖ తెలిపింది. తీవ్ర అల్పపీడనం పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ బుధవారానికి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

దానికి అనుబంధంగా 4.5కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. బుధవారం మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.

రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడోనెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం తర్వాత రాష్ట్రంలో వర్షాలు తగ్గే అవకాశం ఉంది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, విజయనగరం, క్రిష్ణ, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసాయి. చలిగాలులు కూడా వీచాయి. అల్పపీడనం తీరానికి సమీపంలో కేంద్రీక్రుతమై ఉండటంతో తీరప్రాంత జిల్లాల్లో అకాశం మేఘావ్రుతమై ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కళింగపట్నం, విశాఖపట్నం, తుని, కాకినాడ, మచిలీపట్నం, నందిగామ, గన్నవరం, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తోపాటు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 7 డిగ్రీల వరకు తగ్గాయి.

Tags:    

Similar News