Ap Fibernet: ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం..

Ap Fibernet: వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్‌లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ జీవీరెడ్డి కీలక ప్రకటన చేశారు.

Update: 2024-12-24 12:31 GMT

Ap Fibernet: ఏపీ ఫైబర్‌ నెట్ నుంచి 410 మంది తొలగింపు.. ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం..

Ap Fibernet: వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ఫైబర్ నెట్‌లో నియమితులైన 410 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఆ సంస్థ చైర్మన్ జీవీరెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ లో అక్రమాలకు పాల్పడిందని జీవిరెడ్డి ఆరోపించారు. అవసరం లేకపోయినా నిబంధనలకు విరుద్దంగా నియమాకాలు జరిపారని విమర్శించారు. ఆఫర్ లెటర్, అపాయింట్ మెంట్ కూడా లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని ఆయన చెప్పారు.

న్యాయపరంగా సమస్యలు రాకుండా సలహా తీసుకున్నాకే ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వైసీపీ నాయకుల ఆదేశాలతో అర్హతలు లేకుండా ఉద్యోగులను నియమించారని ఆయన ఆరోపించారు. కొందరు ఫైబర్ నెట్ లో నియమితులై.. గతంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల ఇళ్లలో పనిచేశారన్నారు. వేతనాల పేరిట ఏపీ ఫైబర్ నెట్ నుంచి కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. ఫైబర్ నెట్ సంస్థ దివాలా అంచుకు చేరిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంలో ఏపీ ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మకు రూ.1 కోటి 15 లక్షల రూపాయలు అక్రమంగా చెల్లించారని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా ఈ నిధులు చెల్లించారని...వీటిని తిరిగి చెల్లించాలని ఆర్జీవీకి నోటీసులు పంపామన్నారు. దీని కోసం 15 రోజుల సమయం ఇచ్చామని ఆయన తెలిపారు. నిర్జీత గడువులోగా డబ్బు చెల్లించకపోతే వర్మపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. మరో కొద్ది రోజుల్లో మరో 200 మంది ఉద్యోగుల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏపీ ఫైబర్ నెట్‌ను ప్రక్షాళన చేస్తున్నామని ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీరెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News