TTD Board Meeting Points: భక్తుల సౌకర్యం కోసం టీటీడీ బోర్డు తీసుకున్న కొత్త నిర్ణయాలు

Update: 2024-12-24 12:07 GMT

TTD Board Meeting Points: తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలను విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ బోర్డ్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. దేశం నలుమూలల నుండి వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వస్తుంటారు. దానివల్ల తిరుపతిలో రద్దీ భారీగా పెరిగిపోతోంది. ప్రత్యేక దినాల్లో, ఉత్సవాల సమయంలో ఆ రద్దీ మరింత రెట్టింపు అవుతోంది.

భక్తుల రద్దీతో తిరుపతికి ఆదాయం పెరుగుతున్నప్పటికీ శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించడం కత్తిమీద సాము అవుతోంది. దానికితోడు కొన్నిసార్లు శ్రీవారి భక్తులు 24 గంటలకుపైగా క్యూలైన్లలోనే వేచి ఉన్న సందర్భాలున్నాయి. అలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయం నమూనాలో ఆలయం నిర్మాణాలు చేపట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించుకుంది.

టీటీడీ తీసుకున్న ఇంకొన్ని ముఖ్యమైన నిర్ణయాలు

ముంబైలో 10 ఎకరాల్లో శ్రీవారి ఆలయం నిర్మాణంతో పాటు ఆ పక్కనే ఉన్న మూడున్నర ఎకరాల స్థలంలో పద్మావతి అమ్మవారి ఆలయం నిర్మాణం పనులపై ఫోకస్.

క్యూలైన్లలో వెళ్తున్న భక్తులకు అత్యాధునిక సౌకర్యాలతో 3 కోట్ల 36 లక్షల రూపాయల నిధులతో టాయిలెట్స్ నిర్మాణం.

సిమ్స్ ఆసుపత్రికి జాతీయ హోదా కల్పించేందుకు కేంద్రానికి ప్రతిపాదన.

తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ దేవస్థానం అందిస్తోన్న సేవలపై ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వారి నుండి పూర్తిస్థాయిలో ఫీడ్‌బ్యాక్ తీసుకునేలా ఏర్పాట్లు.

తిరుమలలో భక్తులుకు అందించే ఆహార పదార్థాల విషయంలో కొత్త పాలసీ తీసుకొచ్చే యోచన.

శ్రీవారి అన్న ప్రసాద కేంద్రంలో భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేలా అదనపు సిబ్బందిని నియమించేందుకు టీటీడీ బోర్డ్ నిర్ణయం.

తిరుపతిలోని కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలకు రూ. 2 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం.

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో రూ. 43 లక్షలతో బంగారు కలశం ఏర్పాటుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. 

Tags:    

Similar News