Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..దర్శనం టికెట్లు, గదులపై కీలక ప్రకటన

Update: 2024-12-25 02:49 GMT

Tirumala: తిరుమల శ్రీవారికి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నముందుగానే గదులు, దర్శనం టైమ్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ నేపథ్యంలోనే శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. 2025 మార్చి నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవాటికెట్ల కోటాను ఆన్ లైన్ లో విడుదల చేసే సమయం, తేదీ ప్రకటించింది టీటీడీ. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

అదేవిధంగా డిసెంబర్ 26వ తేదీ సాయంత్రం 3గంటలకు గదుల కోటా విడుదల చేయనున్నారు. టీటీడీ అఫిషియల్ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.inలో మాత్రమే ఈ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. మరోవైపు 2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకంఠ ద్వారా దర్శనానికి గాను ఇప్పటికే టోకేన్స్ కూడా జారీ చేసింది. శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మంగళవారం ఆన్ లైన్ లో విక్రయించింది. ఆ టికెట్ల హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఇక తాజాగా టీటీడీ పలు కీలక నిర్ణయాలు సైతం తీసుకుంది. దీనిలో భాగంగా స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించనున్నట్లు పేర్కొంది. ప్రతినెల మొదటి మంగళవారం తిరుపతిలోని స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ తెలిపింది. ఈమేరకు జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోనూ, తిరుమల బాలాజీ నగర్ లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.

Tags:    

Similar News