CM KCR: భాష, భావం, దేశం, ఖండం వేరుకావచ్చు కానీ.. పరమాత్మను ఆరాధించడమనేది పరంపరగా కొనసాగుతోంది
CM KCR: హైదరాబాద్ నార్సింగిలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు భూమిపూజ.. హాజరైన సీఎం కేసీఆర్
CM KCR: భాష, భావం, దేశం, ఖండం వేరుకావచ్చు కానీ.. పరమాత్మను ఆరాధించడమనేది మానవ జీవితం ప్రారంభం నుంచి నేటి వరకు పరంపరగా కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక చక్కటి మానవ కళ్యాణం కోసం సాగుతున్నటువంటి సందర్భమని సీఎం కేసీఆర్ అన్నారు. మతం పేరిట చెలరేగేటువంటి దుష్పరిణామాలను నివారించేందుకు, అది పేట్రేగకుండా వుండడానికి హరేకృష్ణ సంస్థ కూడా కృషి చేయాలన్నారు. హైదరాబాద్ నార్సింగిలో హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు భూమిపూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ దేవాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 25 కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ ప్రకటించారు. నార్సింగిలో 200 కోట్ల రూపాయలతో ఆరు ఎకరాల విశాలమైన స్థలంలో 400 అడుగుల ఎత్తున దేవాలయం నిర్మించనున్నారు. శ్రీ రాధాకృష్ణ మరియు శ్రీ శ్రీనివాస గోవిందుల దేవాలయాలతో పాటు సువిశాల గోష్పాద క్షేత్రంలో ఇది నిర్మితం కానుంది.