ధరణిపోర్టల్‌ దేశానికే ట్రెండ్‌ సెట్టర్‌ : సీఎం కేసీఆర్

భూ పరిపాలనలో ఒక కొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాలుగా పీఠముడిగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికేసింది.

Update: 2020-10-29 08:12 GMT

తెలంగాణాలో భూ పరిపాలనలో ఒక కొత్త శకం ఆరంభమైంది. దశాబ్దాలుగా పీటముడిగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ తెలంగాణ ముంగిట్లోకి వచ్చేసింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవిష్యత్తులో స్థిరాస్తుల విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ధరణి పోర్టల్‌ను రూపొందించింది తెలంగాణ సర్కార్. మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లాలోని సీఎం దత్తత గ్రామమైన మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు సీఎం కేసీఆర్.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ... ధరణిపోర్టల్‌ భారతదేశానికి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుందన్నారు. ఒకప్పుడు భూమి ఉత్పత్తి సాధనం మాత్రమే. ఇప్పుడు అలా కాదు. తప్పు చేసే అధికారం నాకులేదు. ఒక తప్పు జరిగితే భవిష్యత్‌ తరాలు ఇబ్బందులు పడతాయి. తప్పటడుగులు లేకుండా కఠినంగా నిర్ణయాలు తీసుకున్నాం. మూడుచింతలపల్లికి ప్రత్యేకమైన గౌరవం దక్కింది. చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది. తెలంగాణ ముద్దుబిడ్డ వీరారెడ్డి 1969లో రాష్ట్రం కోసం పోరాటం చేసిన వారిలో అగ్రణ్యులు. ఆ మహనీయుడు పుట్టిన గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని భావించి ఇక్కడ ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాడి జైలుపాలైన వ్యక్తుల్లో వీరారెడ్డి ఒకరు అని కేసీఆర్‌ అన్నారు. మేడ్చ‌ల్ జిల్లా మూడుచింత‌ల‌ప‌ల్లిలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, మంత్రి మ‌ల్లారెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News