హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల వివాదం: హైదర్‌గూడ వద్ద పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యేలు

HCU Land Dispute: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భూముల అంశం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది.

Update: 2025-04-01 05:58 GMT

HCU Land Dispute: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భూముల అంశం మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. సెంట్రల్ యూనివర్శిటీని సందర్శించేందుకు వెళ్లిన బీజేపీ నాయకులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదర్ గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ ప్రజా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. హెచ్‌సీయూ భూముల వివాదం నేపథ్యంలో హెచ్ సీ యూను ఇవాళ సందర్శించాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఆ పార్టీకి చెందిన కీలక నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

హెచ్‌సీయూ సందర్శనకు అనుమతి లేదని పోలీసులు బీజేపీ శ్రేణులు, నాయకులను అడ్డుకున్నారు. మరో వైపు బీజేపీ శాసనసభపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఆయన నివాసంలోనే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే హెచ్ సి యూ మెయిన్ గేట్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. హెచ్ సి యూ విద్యార్థులు తరగతులు బహిష్కరించి నిరసనకు దిగారు.

Tags:    

Similar News