Bhatti Vikramarka Mallu: ప్రజలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు వెన్నతో పెట్టిన విద్య
Bhatti Vikramarka Mallu: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు ఇస్తాం
Bhatti Vikramarka Mallu: బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైరయ్యారు. ఖమ్మం జిల్లా మోటమర్రిలో భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ హామీల అమలుకు నిధులు లేకపోతే.. బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టో అమలు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాలు, దళితుడిని సీఎం చేస్తామని చెప్పి బీఆర్ఎస్ మోసం చేసిందన్నారు. ప్రజలను మోసం చేయడం బీఆర్ఎస్‌కు వెన్నతో పెట్టిన విద్య ఎద్దేవా చేశారాయన. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి పాలకుల దోపిడి అరికడితే చాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అందరికీ అందిస్తామన్నారు. ప్రజల సంపద ప్రజలకు చెందాలని భావించే ప్రతి ఒక్కరు తెలంగాణలో ప్రజల ప్రభుత్వం రావడానికి చేయి గుర్తుపై ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు.