Bathukamma: నేటి నుంచి తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు..తీరొక్క పూలతో ఊరంతా జాతర

Bathukamma: నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ సంబురాలు షూరు కానున్నాయి. తెలంగాణ అంతటా గ్రామ గ్రామానా..వీధి వీధినా సంబురంగానే చేసుకునే బతుకమ్మ పండుగ. ఆటపాటలతో..ఆడపడుచుల ఆనందంతో తమ సంతోషాన్ని ఇతరులతో పంచుకునే ఒక సామాజిక జీవన పండుగ బతుకమ్మ పండగ.

Update: 2024-10-02 02:20 GMT

వానాకాలం వేళ్లే ముందు తెలంగాణ ప్రాంతంలో విరబూసే తంగేడు పువ్వులతో సింగారించుకున్న పల్లె ఆడపడుచులతో ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఎటు చూసిన మత్తడి దూకే చెరువులు, నిండు కుండల్లా కుంటలు, ఆపై గట్ల మీద పూసిన గునుగు పువ్వులతో తెలంగాణ పల్లెలకు అందాలు సంతరించుకున్నాయి.

ధగధగ మెరిసే గుమ్మడిపూలు, కట్లపూలు, బంతిపూలతో గ్రామీణ ప్రాంతాలు ఆభరణాలు తొడిగిన ఆడపడుచులా కనిపిస్తాయి. పొలాల గట్ల మీద నుంచి పువ్వులు కొసుకువచ్చి బతుకమ్మ పేర్చుతుంటారు.తెలంగాణ సంస్క్రుతికీ , వైభవానికీ ప్రతీకగా నిలిచే ఈ 9 రోజుల పండగ మహాలయ పక్ష అమావాస్యతో షురూ అవుతుంది.

కొన్నిచోట్ల పిత్రు అమావాస్య నుంచి మట్టితో చేసిన బొడ్డెమ్మలను సాగనంపి..ఆ తెల్లవారు జాము నుంచి ప్రతిరోజూ సాయంత్రం అందంగా అలంకరించుకున్న ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చుతారు. లయబద్ధంగా ఆడుతారు. లక్ష్మీదేవి, గౌరమ్మ, పార్వతి, శివుడి గురించిన పాటలు మారుమ్రోగుతుంటాయి.

బతుకమ్మ మీదనే ఎక్కువగా పాటలు ఉంటాయి. అక్టోబర్ 2న ప్రారంభమయ్యే ఈ బతుకమ్మ వేడుకలు 9 రోజుల పాటు వైభవంగాసాగుతాయి. అక్టోబర్ 10వ తేదీన సద్దుల బతుకమ్మతో సంబరాలు ముగుస్తాయి.

Tags:    

Similar News