Bandi Sanjay: దేశ్ పాండే విషయంలో అన్యాయం జరిగింది

Bandi Sanjay: పార్టీలో సముచిత స్థానం కల్పిస్తాం

Update: 2023-11-13 10:33 GMT

Bandi Sanjay: దేశ్ పాండే విషయంలో అన్యాయం జరిగింది

Bandi Sanjay: బీజేపీలో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. సంగారెడ్డి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ దేశ్‌పాండే నివాసానికి బండి సంజయ్ వెళ్లారు. సంగారెడ్డిలో ఇండిపెండెంట్‌గా దేశ్‌పాండే బరిలోకి దిగగా బండి సంజయ్ దేశ్ పాండేను బుజ్జగించే పనిలో పడ్డారు. అంతేకాకుండా ఎన్నికల్లో పార్టీతో కలిసి పనిచేయలని కోరారు. దేశ్‌పాండే విషయంలో అన్యాయం జరిగిందన్న బండి.. తనకు పార్టీ లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News