Hyderabad: మలక్‌పేట ప్రభుత్వాస్పత్రిలో దారుణం
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతలు మృతి
Hyderabad: హైదరాబాద్ మలక్‌పేట ప్రభుత్వాస్పత్రిలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింతలు మృతి చెందారు. నాగర్‌కర్నూలు జిల్లా చెదురుపల్లి గ్రామానికి చెందిన సిరివెన్నెల, సైదాబాద్‌కు చెందిన శివాని ప్రసవాల కోసం మలక్‌పేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చారు. అయితే ఇద్దరికి ఆపరేషన్ చేసిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో బాలింతలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబసభ్యులు ఆరోపించారు. వైద్యం చేసిన డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి ఎదుట బంధువులు, కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.