Amit Shah: ఈనెల 17న తెలంగాణకు అమిత్ షా.. అదే రోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల
Amit Shah: నల్గొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్‌లో సభలు
Amit Shah: ఎన్నికలు సమీపిస్తుండటంతో.. రాష్ట్రంలో బీజేపీ జోష్ పెంచింది. వరుస సభలతో బీజేపీ స్పీడ్ పెంచింది. ఈనెల 17న తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. అదే రోజు బీజేపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు అమిత్ షా. హోటల్ కత్రియాలోని బీజేపీ మీడియా సెంటర్‌లో విడుదల చేయనున్నారు. అనంతరం తెలంగాణలో అమిత్ షా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. 17న 4 సభలకు హాజరుకానున్నారు. నల్లగొండ, వరంగల్, గద్వాల్, రాజేంద్రనగర్ లో అమిత్ షా పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఆ తర్వాత 26 నుంచి వరుసగా మోడీ కూడా హాజరుకానున్నట్టు తెలుస్తుంది.