Most Hatred Cricketers: క్రికెట్ చిన్న పిల్లలు ఒక సబ్జెక్టులా, పెద్ద వాళ్ళు ఒక ఉద్యోగంలా మ్యాచ్ ఉంటే చాలు టీవిలకు అతుక్కుపోవడం లేదా ఎప్పటికప్పుడు స్కోర్ అప్డేట్ లు చూడటం మనదేశంలో చాలా మాములు విషయం. ఎంతపని ఉన్న పనులన్నీ పక్కనపెట్టి చూసే అభిమానులు, పనిలోనే ఉండి చూసే వాళ్ళు మన దేశంలో కోట్లల్లో ఉన్నారు. తమ అభిమాన క్రికెటర్ లను సొంత మనిషిలా ఫీల్ అయ్యే అభిమానులు అదే విధంగా తమకి నచ్చని ఆటగాళ్ళను అంతే విధంగా ద్వేషిస్తారు. అయితే తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలో భారత క్రీడాభిమానులు ఎక్కువగా ద్వేషించే (హేటర్స్) ఐదుగురు క్రీడాకారుల పేర్లను వాటి సందర్భాలను ఒక సర్వే సంస్థ తెలిపింది.
ఈ సర్వేలో మొదటి స్థానంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. 2006 లో భారత్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆండ్రూ సైమండ్స్ మరియు హర్బజన్ మధ్య జరిగిన మంకీ గేట్ వివాదంతో సైమండ్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కొని అప్పట్లో అభిమానుల దృష్టిలో విలన్ గా మిగిలిపోయాడు. ముసాఫిర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ 2016 లో టీ20 వరల్డ్ కప్ లో భారత్ చేతిలో ఓడిన తర్వాత అసహనానికి గురై ట్విట్టర్ లో టీం ఇండియాపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ తర్వాత ఆ ట్వీట్ ని డిలీట్ చేశాడు. ఇక మూడో స్థానంలో పాకిస్తాన్ ఆటగాడు జావేద్ మియాందాద్ తన వరల్డ్ క్రికెట్ రిటైర్మెంట్ తర్వాత సచిన్ టెండూల్కర్ పై నోరు జారి భారత అభిమానుల కోపానికి గురైయ్యాడు.
ఇక నాలుగోవ స్థానంలో రికి పాయింటింగ్ ఆస్ట్రేలియన్ ప్రపంచ క్రికెట్ లో మంచి కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న కొన్ని సందర్భాల్లో తన ఆవేశంతో అభిమానుల ఆగ్రహానికి లోనయ్యాడు. జవగళ్ శ్రీనాథ్ వేసిన ఒక బౌన్సర్ కి రికి తలకి తగలడంతో వెంటనే వెళ్లి చూసిన శ్రీనాథ్ నూ నెట్టేసి తన కోపాన్ని చూపాడు. అయిదవ స్థానంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ఫ్లింటఫ్ భారత జట్టుతో ట్రై సిరీస్ లో గెలిచినా సందర్భంగా ఫ్లింటఫ్ క్రీడా మైదానంలో తన జెర్సీ విప్పి పరుగులు పెడుతూ అసభ్య పదజాలంతో గోల చేయగా అదే ఏడాది ఇంగ్లాండ్ పై మరో సిరీస్ గెలవడంతో గంగూలీ తన జెర్సీ విప్పి సంబురాలు చేసుకుంటూ ఫ్లింటాఫ్ కి సరైన సమాధానమే చెబుతాడు.