IPL 2025 Auction: భారత స్టార్ ప్లేయర్లకు భారీ షాక్‌.. ఎవరూ పట్టించుకోలే

IPL Auction 2025 Unsold Players List: సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం రెండో రోజు జరుగుతోంది.

Update: 2024-11-25 14:00 GMT

IPL Auction 2025 Unsold Players List

IPL Auction 2025 Unsold Players List: సౌదీ అరేబియా రాజధాని జెడ్డాలో ఐపీఎల్ 2025 మెగా వేలం రెండో రోజు జరుగుతోంది. రెండోరోజు వేలంలో భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్‌ (రూ.10.75), దీపక్‌ చహర్‌ (రూ.9.25), ముకేశ్ కుమార్‌ (రూ.8 కోట్లు), ఆకాశ్‌ దీప్ (రూ.8 కోట్లు), తుషార్‌ దేశ్‌పాండే (రూ.6.50 కోట్లు)లకు భారీ ధర పలికింది. మొదటిరోజు టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ 27 కోట్లతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇదే వేలంలో కొందరు భారత స్టార్లకు భారీ షాక్ తగిలింది.

ఐపీఎల్ 2025 మెగా వేలంలో పృథ్వీ షా, అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్, కేఎస్ భరత్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. వీరిని తీసుకోవడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. కనీస ధరకు కూడా వీరిని తీసుకోలేదు. విదేశీ ప్లేయర్స్ కేన్ విలియమ్సన్, ఆదిల్ రషిద్, గ్లెన్ ఫిలిప్స్‌, అకీలా హోస్సేన్, కేశవ్‌ మహరాజ్‌, ముజీబుర్ రెహ్మన్, విజయ్‌కాంత్ వియస్కాంత్, డారిల్ మిచెల్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ముందుకురాలేదు. రెండో రోజు వేలంలోకి వచ్చిన ఈ ఆటగాళ్లను తీసుకోకోకపోవడానికి కారణం గత సీజన్లో వీరు రాణించకపోవడమే.

స్పెషలిస్ట్‌ ఓపెనర్‌గా ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షా.. ప్ర‌స్తుతం పేలవ ఫామ్‌, ఫిట్‌నెస్ సమస్యలతో సతమతమవుతున్నాడు. ఇటీవల ఢిల్లీ రంజీ జట్టులో కూడా స్థానం కోల్పోయాడు. ఈ కారణంగానే అతడిని ఏ ప్రాంచైజీ ఎప‌ట్టించుకోలేదు. అడపాదపగా మెరుపులు తప్పితే రాణించని అజింక్య రహానే, మయాంక్ అగర్వాల్‌లకు నిరాశే ఎదురైంది. గాయం కారణంగా గత కొన్ని నెలలకు ఆటకు దూరంగా ఉన్న శార్ధూల్ ఠాకూర్.. ఇటీవలే మైదానంలో అడగుపెట్టాడు. ఇటీవలి రోజుల్లో పెద్దగా క్రికెట్ ఆడని అతడిని కొనేందుకు కూడా ప్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు. వీరందరిని సెకెండ్‌ రౌండ్‌లోనైనా ఎవరైనా కొంటారో చూడాలి.

అన్‌సోల్డ్ లిస్ట్ ఇదే:

పృథ్వీ షా

అజింక్య రహానే,

శార్దూల్ ఠాకూర్

మయాంక్ అగర్వాల్

కేఎస్ భరత్

కేన్ విలియమ్సన్

ఆదిల్ రషిద్

గ్లెన్ ఫిలిప్స్‌

అకీలా హోస్సేన్

కేశవ్‌ మహరాజ్‌

ముజీబుర్ రెహ్మన్

విజయ్‌కాంత్ వియస్కాంత్

డారిల్ మిచెల్‌

Tags:    

Similar News