Virat Kohli: అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విరాట్.. ఆ ఘనత సాధించిన బ్యాటర్‌గా..
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన కోహ్లి పలు అరుదైన రికార్డులను సృష్టించాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టుపై ఇప్పటి వరకు కోహ్లి ఏడు సెంచరీలు సాధించాడు.
అంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండుల్కర్‌పై ఉండేది. సచిన్ ఆస్ట్రేలియాలో ఆరు సెంచరీలు చేయగా ఇప్పుడు కోహ్లి ఈ రికార్డును బ్రేక్ చేశాడు. గత కొన్ని రోజులుగా తడబడుతోన్న కోహ్లి ఏడాది తర్వాత సెంచరీ సాధించాడు. గతేడాది పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌పై సెంచరీ చేసిన తర్వాత కోహ్లీకి ఇదే తొలి టెస్టు సెంచరీ కావడం గమనార్హం.
ఇదిలా ఉంటే పెర్త్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లి.. 143 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ బాదాడు. టెస్టు కెరీర్‌లో 30వ సెంచరీ, ఓవరాల్‌గా 81వ సారి సెంచరీ దాటాడు. ఇలా ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆసియా క్రికెటర్‌గా కూడా విరాట్ అరుదైన ఘనత సాధించాడు.
ఇక అన్ని ఫార్మాట్లలో కలిసి ఆస్ట్రేలియాలో కోహ్లికి ఇది 10వ సెంచరీ కావడం విశేషం. ఆస్ట్రేలియాలో పర్యటించిన క్రికెటర్లలో ఈ ఘనత కేవలం విరాట్‌కు మాత్రమే సొంతం కావడం విశేషం. ఇక ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో విరాట్ సెంచర్ చేయగానే.. భారత్ 6 వికెట్లకు 487 పరుగుల వద్ద డిక్లేర్ చేసి, ఆస్ట్రేలియాకు 534 లక్ష్యాన్ని నిర్దేశించింది.