IPL 2025 Auction: ఎస్‌ఆర్‌హెచ్‌ ఆక్షన్ ప్లాన్.. కావ్య మారన్ టార్గెట్ చేసింది వీరినే!

IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరోకొద్ది గంటల్లో సౌదీ అరేబియా రాజధాని జడ్డాలో మెగా వేలంకు తెరలేవనుంది.

Update: 2024-11-24 05:30 GMT

 IPL 2025 Auction: ఎస్‌ఆర్‌హెచ్‌ ఆక్షన్ ప్లాన్.. కావ్య మారన్ టార్గెట్ చేసింది వీరినే!

IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరోకొద్ది గంటల్లో సౌదీ అరేబియా రాజధాని జడ్డాలో మెగా వేలంకు తెరలేవనుంది. రెండు రోజుల పాటు (నవంబర్ 24, 25) జరిగే ఈ ఆక్షన్ మధ్యాహ్నం 3.30కి ప్రారంభం కానుంది. వేలానికి మొత్తం 1,574 మంది ప్లేయర్స్ తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీల సూచనల మేరకు 577 మందిని బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఫ్రాంచైజీలు తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి. తెలుగు టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) కొందరి ఆటగాళ్లను టార్గెట్ చేయునట్లు తెలుస్తోంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు), పాట్ కమిన్స్ (రూ.18 కోట్లు), అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు), ట్రావిస్ హెడ్ (రూ.14 కోట్లు), నితీష్ రెడ్డి (రూ.6 కోట్లు)లను తీసుకుంది. వీరి కోసం రూ.75 కోట్లు ఖర్చు చేయగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ పర్స్ వాల్యూలో రూ.45 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బులతో గరిష్టంగా 20 మంది లేదా కనిష్టంగా 18 మందిని తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఓ లిస్ట్‌ను తయారు చేసినట్లు సమాచారం.

హైదరాబాద్‌కు మిడిలార్డర్ బ్యాటర్ల అవసరం ఉంది. దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్‌లను తీసుకోవాలనుకుంటుందట. అయితే ఈ ఇద్దరు తక్కువ ధరకు వచ్చే అవకాశం లేదు. అందుకే అన్‌క్యాప్‌డ్ జాబితాలో అథర్వ టైడ్, నమన్ ధిర్, అభినవ్ మనోహర్‌ల కోసం ట్రై చేయనుందట. అబ్దుల్ సమద్‌, సమీర్ రిజ్వీని టార్గెట్ చేసిందని తెలుస్తోంది. మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ వంటి టీమిండియా పేసర్లను ఎస్‌ఆర్‌హెచ్‌ టార్గెట్ చేయనుంది. వీరు దక్కకుంటే భువనేశ్వర్, నటరాజన్, ఆవేశ్ ఖాన్‌ను తీసుకునేందుకు ప్రయత్నించనుంది. పియూష్ చావ్లా, వానిందు హసరంగా, ఆడమ్ జంపా, హర్‌ప్రీత్ బ్రార్, మయాంక్ అగర్వాల్, రోవ్‌మన్ పోవెల్, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్‌పాండేలను టార్గెట్ చేసిందట.

మార్క్రరమ్, బెయిరిస్టో, డేవిడ్ లాంటి విదేశీ ఆటగాళ్లు ఎస్‌ఆర్‌హెచ్‌ లిస్టులో ఉన్నారట. చూడాలి మరి కావ్య పాప ఎవరిని తీసుకుంటుందో. గత వేలంలో కావ్య ఆచితూచి వ్యవహరించిన విషయం తెలిసిందే. మంచి ఆటగాళ్లను తీసుకుని పటిష్ట జట్టును తయారు చేసింది. అద్భుత ఆటతో ఈ ఏడాది ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఆడింది. ఈసారి కూడా మంచి జట్టును సిద్ధం చేయాలని కావ్య పాప డిసైడ్ అయింది.

Tags:    

Similar News