IPL Action: మెగా వేలం రికార్డులు బ్రేక్ చేసే మొనగాళ్లు వీళ్లే...వీరిపైనే అందరిచూపు?
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 577 మంది ఆటగాళ్ల భవితవ్యం త్వరలోనే ఖరారు కానుంది. ఈ వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో రెండు రోజులు జరగనుంది. ఈ సమయంలో అందరి దృష్టి ఐదుగురు ఆటగాళ్లపై ఉంటుంది. ఈ ఆటగాళ్లు ఈసారి వేలంలో అన్ని రికార్డులు బద్దలు కొట్టేయనున్నారు. కాగా జట్లు ఇప్పటికే 46 మంది ఆటగాళ్లను రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వేలం సమయంలో 204 స్లాట్స్ మాత్రమే భర్తీ చేయాల్సి ఉంది. ఈ సారి వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్ల కనిపించనున్నారు. గత సీజన్ లో ఏదొక జట్టు లేదా మరొక జట్టుకు కెప్టెన్ గా ఉన్న కొంతమంది ఆటగాళ్లు కూడా ఇందులో ఉన్నారు. ఈ 577 మంది ఆటగాళ్లలో మెగా వేలంలో అన్ని రికార్డు బద్దలుకొట్టే ఐదుగురు ఆటగాళ్లున్నారు. వాళ్లు ఎవరో చూద్దాం.
1. రిషబ్ పంత్:
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ పేర్లలో ఒకటి. వేలంలో ఈ స్టార్ వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ రూ. 20-25కోట్లు పొందుతారనే పలువురు అనుభవజ్నులు భావిస్తున్నారు. రిషబ్ పంత గత సీజన్ వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కు కెప్టెన్ గా ఉన్నాడు. ఈసారి అతన్ని రిటైన్ చేయలేదు. చాలా జట్లకు కొత్త కెప్టెన్లు అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో చాలా జట్లు ఆయన పోటీ పడవచ్చు. ఇప్పటి వరకు ఐపీఎల్ వేలంలో అత్యధిక బిడ్ రూ. 24.75కోట్లు ఉంది. మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ వేసింది. ఈ సారి ఈ రికార్డు ప్రమాదంలో పడే ఛాన్స్ కనిపిస్తోంది.
2. కేఎల్ రాహుల్:
కేఎల్ రాహుల్ కూడా ఈసారి చాలా జట్ల కళ్లలో పడబోతున్నాడు. కెప్టెన్సీతోపాటు వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. గత సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 132 మ్యాచ్ లు ఆడిన రాహుల్ 4683 పరుగులు చేశాడు. ఈలీగ్ లో అతని పేరుతో నాలుగు సెంచరీలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతను ఐపీఎల్ లో 134. 60 స్ట్రైక్ రేటుతో పరుగులు చేశాడు.
3. అర్ష్దీప్ సింగ్ :
భారత జట్టు స్టార్ బౌలర్ అర్ష్ దీప్ ను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేయలేదు. ప్రస్తుతం అర్ష్ దీప్ టీ20లో అత్యంత విజయవంతమైన బౌలర్లల ఒకడుగా ఉన్నాడు. గత సీజన్ వరకు అర్ష్ దీప్ కు రూ. 4కోట్లు వేతనంగా లభించింది. ఈసారి అర్ష్ దీప్ సింగ్ చాలా ఖరీదై ఉండొచ్చు. అర్ష్ దీప్ సింగ్ టీ20 ఫార్మాట్ లో టీమిండియా కోసం నిలకడగా రాణిస్తున్నాడు. దీనికి మెగా వేలం సమయంలో అతనికి రికార్డ్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.