IPL 2025 Auction: ఐపీఎల్ 2025 వేలం డేట్స్, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్.. ఆక్షనర్‌ ఎవరంటే?

IPL 2025 Auction: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ మరికొన్ని గంటల్లో జరగనుంది.

Update: 2024-11-24 04:30 GMT

IPL 2025 Auction: ఐపీఎల్ 2025 వేలం డేట్స్, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్.. ఆక్షనర్‌ ఎవరంటే?

IPL 2025 Auction: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ మరికొన్ని గంటల్లో జరగనుంది. నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా వేలం జరగనుంది. ఇందుకు సంబంధించి బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. అబాడి అల్ జోహార్ అరేనాలో జరగనున్న వేలం కోసం ప్రాంచైజీ ఓనర్స్ ఇప్పటికే జెడ్డాకు చేరుకున్నారు. హోటల్ షాంగ్రి-లాలో ప్రాంచైజీ ఓనర్స్, అధికారులు బస చేస్తున్నారు. వేలంకు సమయం ఆసన్నమైన నేపథ్యంలో డేట్స్, టైమ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

భారత కాలమానం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ 2025 వేలం ప్రక్రియ ఆరంభం కానుంది. ముందుగా 3 గంటలకే షెడ్యూల్ చేసినా.. బీసీసీఐ అధికారులు ఈరోజు టైమింగ్ మార్చారు. పెర్త్ టెస్టు 3, 4 రోజుల ఆట ముగిశాక వేలం మొదలుకానుంది. టెస్ట్ మ్యాచ్ మూడు గంటలకు ముగియనుండగా.. వేలం అర్ధగంట తరవాత ఆరంభమవుతుంది. మొదటి రోజు దాదాపుగా 7-8 గంటల పాటు వేలం జరుగుతుంది. మధ్యలో 45 నిమిషాల పాటు లంచ్ బ్రేక్ ఉండగా.. మద్యమద్యలో టీ బ్రేక్ కూడా ఉంటుంది.

ఐపీఎల్ 2025 వేలంను స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ కానుంది. జియోసినిమా యాప్‌లో కూడా చూడొచ్చు. ఇక ఆక్షనర్‌గా మల్లికా సాగర్ వ్యవహరించనున్నారు. ఐపీఎల్ 2024 వేలాన్ని మల్లికానే విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది హ్యూ ఎడ్మీడ్స్ స్థానంలో ఆక్షనర్‌గా వచ్చిన మల్లికా.. తొలి మహిళా నిర్వాహకురాలిగా చరిత్ర సృష్టించారు. మహిళల ప్రీమియర్ లీగ్ 2023 వేలాన్ని కూడా ఆమె నిర్వహించారు. ప్రొ కబడ్డీ లీగ్ వేలాన్ని నిర్వహించిన తొలి మహిళగా కూడా గుర్తింపు పొందారు.

ఐపీఎల్ 2025 వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో 367 మంది ఇండియన్ ప్లేయర్స్ కాగా.. 210 మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. 10 ఫ్రాంఛైజీలు 204 మందిని కొనుగోలు చేస్తాయి. ఈసారి వేలంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్, డేవిడ్ వార్నర్‌, ఆర్ అశ్విన్, జోస్ బట్లర్, ఇషాన్ కిషన్ లాంటి స్టార్స్ ఉన్నారు. అయితే అందరి దృష్టి మాత్రం పంత్, రాహుల్‌, అయ్యర్లపై మాత్రమే ఉంది.ఈ ముగ్గురికి కోట్ల వర్షం పక్కా అని తెలుస్తోంది.

Tags:    

Similar News