Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. రెండో కెప్టెన్‌గా..!

Jasprit Bumrah: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Update: 2024-11-25 11:39 GMT

Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. రెండో కెప్టెన్‌గా..!

Jasprit Bumrah: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024లో భాగంగా పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 58.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీసిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన బుమ్రా.. సారథిగా అరుదైన రికార్డులు సాధించాడు.

పెర్త్‌లో ఆస్ట్రేలియా‌ను ఓడించిన రెండో ఏషియన్ కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే (2008) సాధించాడు. టెస్టుల్లో అత్యుత్త బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత కెప్టెన్ల జాబితాలో బుమ్రా నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆప్టస్ స్టేడియంలో 72 రన్స్ ఇచ్చిన బుమ్రా 8 వికెట్స్ పడగొట్టాడు. ఈ జాబితాలో కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. 1983లో అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచులో కపిల్ (10/135) పది వికెట్స్ పడగొట్టాడు. బిషన్ సింగ్ బేడీ (10/194), బిషన్ సింగ్ బేడీ (9/70), బుమ్రా (8/72), కపిల్ దేవ్ (8/109) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఆసియా వెలుపల భారత్‌కు రెండో అతిపెద్ద విజయం ఇదే. పెర్త్ టెస్టులో 295 పరుగులతో విజయం సాధించింది. 2019లో వెస్టిండీస్‌పై నార్త్ సౌండ్‌లో 318 పరుగుల తేడాతో గెలిచింది. 1986లో ఇంగ్లాండ్‌పై హెడింగ్లీలో 279 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 1968లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌పై 272 పరుగులు, 2019లో వెస్టిండీస్‌పై కింగ్‌స్టన్ మైదానంలో 257 పరుగుల తేడాతో టీమిండియా విజయాలు అందుకుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా భారత జట్టుకు సారథ్యం వహించిన విషయం తెలిసిందే. తొలి మ్యాచులోనే అద్భుత విజయాన్ని అందుకున్నాడు.

టెస్టుల్లో భారత కెప్టెన్ల అత్యుత్త బౌలింగ్ ప్రదర్శన:

# కపిల్ దేవ్ - వెస్టిండీస్‌, (అహ్మదాబాద్,1983, 10/135)

# బిషన్ సింగ్ బేడీ - ఆస్ట్రేలియా (పెర్త్, 1977, 10/194)

# బిషన్ సింగ్ బేడీ - న్యూజిలాండ్ (చెన్నై,1976, 9/70)

# జస్ప్రీత్ బుమ్రా - ఆస్ట్రేలియా (పెర్త్, ఆప్టస్ స్టేడియం,2024)

# కపిల్ దేవ్ - ఆస్ట్రేలియా (అడిలైడ్, 1985, 8/72)

Tags:    

Similar News