IPL 2025 Auction: ఐపీఎల్ 2025 వేలంలో మెరిసిన తెలుగు ఆటగాళ్లు.. అత్యధిక ధర ఎవరికంటే?

IPL 2025 Auction Telugu Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆది, సోమ వారాల్లో జరిగిన ఆక్షన్‌ అంచనాలకు మించి సాగింది.

Update: 2024-11-26 08:47 GMT

IPL 2025 Auction: ఐపీఎల్ 2025 వేలంలో మెరిసిన తెలుగు ఆటగాళ్లు.. అత్యధిక ధర ఎవరికంటే?

IPL 2025 Auction Telugu Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ముగిసింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆది, సోమ వారాల్లో జరిగిన ఆక్షన్‌ అంచనాలకు మించి సాగింది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (రూ.27 కోట్లు)ను లక్నో సూపర్ జెయింట్స్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు)ను పంజాబ్ కింగ్స్) కొనుగోలు చేశాయి. అయితే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ (రూ.14 కోట్లు)ను ఢిల్లీ కేపిటల్స్ తక్కువకే కొనుగోలు చేయగా.. వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు)ను కేకేఆర్ భారీ ధర పెట్టి కొనుగోలు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వేలంలో మన తెలుగు ఆటగాళ్లు కూడా మెరిశారు. ఆ ప్లేయర్స్ ఎవరో చూద్దాం.

తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది క్రికెటర్లు ఐపీఎల్ 2025 వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు. అయితే ఫ్రాంచైజీలు ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే తీసుకున్నాయి. వేలంకు ముందు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది. విశాఖపట్నంకు చెందిన ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.6 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఈ ఇద్దరు గత ఐపీఎల్ సీజన్లో మంచి ప్రదర్శన చేశారు. అయితే కేఎస్ భరత్, బైలపూడి యశ్వంత్, ఆరవెల్లి అవనీష్ లాంటి టాలెండెడ్ ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు.

హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు భారీ ధర దక్కింది. మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లకు అతడిని సొంతం చేసుకుంది. తెలుగు ఆటగాళ్లలో సిరాజ్‌దే అత్యధిక ధర. గుంటూరుకు చెందిన షేక్ రషీద్ మరోసారి చెన్నైకే సొంతమయ్యాడు. అతడిని సీఎస్కే కనీస ధర రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. గత వేలంలో రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై తీసుకుంది. అయితే ఒక మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. కాకినాడ ఫాస్ట్ బౌలర్‌ సత్యనారాయణ రాజు‌ను ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ముంబై జట్టులోనే తిలక్ వర్మ ఉన్నాడు. ఇద్దరి కలిసి ఆడే అవకాశాలు లేకపోలేదు.

శ్రీకాకుళం కుర్రాడు‌ త్రిపురణ విజయ్‌ను రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఇక విశాఖపట్నంకు చెందిన పైల అవినాష్‌ను రూ.30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ తీసుకుంది. ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో సెంచరీతో చెలరేగడంతో అతడికి ఐపీఎల్ టోర్నీలో చోటు దక్కింది. మన తెలుగు ప్లేయర్స్ ఐపీఎల్ 2025లో రాణించాలని అందరూ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News