MS Dhoni - New Year 2025 : గోవాలో ఎంఎస్ ధోని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

MS Dhoni New Year 2025 : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గోవాలో న్యూ ఇయర్ (2025) వేడుకలను జరుపుకున్నాడు.

Update: 2025-01-01 07:03 GMT

MS Dhoni - New Year 2025 : గోవాలో ఎంఎస్ ధోని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న వీడియో..!

MS Dhoni New Year 2025 : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గోవాలో న్యూ ఇయర్ (2025) వేడుకలను జరుపుకున్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నారు. ధోనీ తన కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడుతారు. మహి 2025ని ప్రారంభించడానికి గోవాను ఎంచుకున్నారు. తన కుటుంబంతో కలిసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. మహి తన కుటుంబంతో కలిసి కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వీడియోలో ధోని భార్య సాక్షితో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించాడు. మరో వీడియోలో మహి డిఫరెంట్ స్టైల్‌లో కనిపించాడు. తన భార్య సాక్షి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వీడియోను పంచుకున్నారు. అందులో ఆమె గోవా మధ్యలో ఉన్న లొకేషన్‌ను షేర్ చేశారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ధోని వివిధ ప్రదేశాలలో కనిపిస్తాడు. 2024లో న్యూ ఇయర్ జరుపుకోవడానికి మహి తన కుటుంబంతో కలిసి దుబాయ్ చేరుకున్నాడు. ఈసారి భారత మాజీ కెప్టెన్ ధోనీ గోవాను ఎంచుకున్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత, ధోనీ ఐపీఎల్‌లో ఆడటం కొనసాగించారు. 2024 ఐపీఎల్ లో ధోని 53.66 సగటుతో, 220.54 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేశాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 37* పరుగులు.

మహీ తన కెరీర్‌లో ఇప్పటివరకు 264 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో 229 ఇన్నింగ్స్‌లలో తను 39.12 సగటుతో.. 137.53 స్ట్రైక్ రేట్‌తో 5243 పరుగులు చేశాడు. ఈ కాలంలో తను 24 హాఫ్ సెంచరీలు చేశారు. ఇందులో అత్యధిక స్కోరు 84* పరుగులు.

ధోని అంతర్జాతీయ కెరీర్

ధోని తన అంతర్జాతీయ కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడడం గమనార్హం. మహీ 144 టెస్టుల్లో 38.09 సగటుతో 4876 పరుగులు చేశాడు. ఇది కాకుండా, అతను వన్డేలో 297 ఇన్నింగ్స్‌లలో 10773 పరుగులు, టీ20 ఇంటర్నేషనల్‌లో 50.57 సగటుతో 1617 పరుగులు చేశాడు.


Tags:    

Similar News