Champions Trophy: చాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాడ్ తో వన్డే సిరీస్ కూడా రోహిత్, విరాట్ దూరం..?
Champions Trophy: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తమ కెరీర్‌లో అత్యంత దారుణమైన దశను ఎదుర్కొంటున్నారు.
Champions Trophy: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తమ కెరీర్‌లో అత్యంత దారుణమైన దశను ఎదుర్కొంటున్నారు. 2024లో వీరిద్దరూ తమ బ్యాటింగ్‌తో అభిమానులను నిరాశపరిచారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా వీరిద్దరు బ్యాట్‌లు ఆడలేదు. ఇదిలా ఉంటే అభిమానుల టెన్షన్‌ని మరింత పెంచే వార్త ఒకటి బయటకు వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం.. రోహిత్, విరాట్ ఫిబ్రవరి 2025లో ఇంగ్లాండ్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ ఆడడం లేదని తెలుస్తోంది. ఇద్దరు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. అయితే ఇదే జరిగితే ఈ నిర్ణయం టీమ్ ఇండియాకు చేదు వార్తగా భావించవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరిలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. అది కూడా వన్డే ఫార్మాట్‌లో మాత్రమే నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియాకు చెందిన ఈ ఇద్దరు దిగ్గజాలు ఎలాంటి సన్నాహకత లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెడితే భారత్ కు మళ్లీ ఎదురు దెబ్బ తగలుతుందని అంటున్నారు.
జనవరి 3 నుంచి 7 వరకు సిడ్నీలో జరగనున్న ప్రస్తుత సిరీస్‌లో చివరి టెస్టు మ్యాచ్‌లో రోహిత్, విరాట్ ఆడనున్నారు. దీని తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్‌తో టీం ఇండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. రోహిత్ విరాట్ గత ఏడాది టీ-20 ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అయ్యారు. టీ-20 సిరీస్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిబ్రవరిలో ఇంగ్లాండ్ - భారత్ మధ్య 3 వన్డే మ్యాచ్ ల సిరీస్ ఉంటుంది. ఈ ఛాంపియన్స్ టోర్నీకి సిద్ధమయ్యే ఏకైక సిరీస్ ఇదే. ఇద్దరూ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
2024లో భారత జట్టు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడింది. శ్రీలంక పర్యటనలో మూడు వన్డేలు ఆడిన భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తొలి వన్డే టై కాగా, ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లోనూ విజయం సాధించి శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుంది. సిరీస్‌లో చివరి మ్యాచ్ 7 ఆగస్టు 2024న జరిగింది. ఇందులో రోహిత్ 35 పరుగులు, విరాట్ 20 పరుగులు చేశారు. అప్పటి నుంచి టీమ్ ఇండియా ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు. రోహిత్ విరాట్ ఎటువంటి సన్నాహకాలు లేకుండా నేరుగా ఛాంపియన్స్ ట్రోఫీలోకి ప్రవేశిస్తే వారు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అది టీమ్ ఇండియా ప్రదర్శనను కూడా ప్రభావితం చేస్తుంది.
భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ షెడ్యూల్
జనవరిలో ఇంగ్లండ్ భారత్‌లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య తొలి 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ జరగనుంది. ఆ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది. తొలి వన్డే ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో, రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో, మూడో వన్డే జనవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది. దీని తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో టీమిండియా క్యాంపెయిన్ ప్రారంభం కానుంది.