Team India Captain: రోహిత్ శర్మ తర్వాత ఇండియా కెప్టెన్ ఎవరు.. టీమ్ ఇండియాలో ఆ టాలెంట్ బుమ్రాకు ఉందా ?

Team India Captain: మెల్‌బోర్న్‌ టెస్టులో ఓడిపోయిన తర్వాత భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏదో జరిగిందన్న వార్తలు వస్తున్నాయి.

Update: 2025-01-01 10:51 GMT

Team India Captain: రోహిత్ శర్మ తర్వాత ఇండియా కెప్టెన్ ఎవరు.. టీమ్ ఇండియాలో ఆ టాలెంట్ బుమ్రాకు ఉందా ?

Team India Captain: మెల్‌బోర్న్‌ టెస్టులో ఓడిపోయిన తర్వాత భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏదో జరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లందరినీ తీవ్రంగా మందలించాడు. అయితే మెల్‌బోర్న్ టెస్టులో ఓటమి తర్వాత.. ఇప్పుడు జనవరి 3 నుంచి ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్‌పై టీమిండియా దృష్టి పెట్టింది. అయితే అంతకుముందే ఆ జట్టులోని ఓ వెటరన్ ప్లేయర్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ ప్రస్తుతం తన బ్యాడ్ ఫామ్, బ్యాడ్ కెప్టెన్సీని ఎదుర్కొంటున్నాడు. ఇంతలో మరొక ఆటగాడు కెప్టెన్ గా రానున్నట్లు మీడియా నివేదికలలో పేర్కొంది.

ఆ ఆటగాడు ఎవరు కావచ్చు?

మీడియా నివేదికలలో ప్లేయర్ పేరు వెల్లడించలేదు. ఆ ఆటగాడు జట్టులో సీనియర్ అని మాత్రమే పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం అందుబాటులో లేనప్పటికీ అతను విరాట్ కోహ్లి అయ్యుంటాడని చాలా మంది అనుకుంటున్నారు. 2022లో టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకున్నాడు.

తదుపరి టెస్టు కెప్టెన్‌గా బుమ్రా

ఇది మీడియా నివేదికల విషయం అయితే భారత టెస్ట్ జట్టు తదుపరి కెప్టెన్‌గా మారడానికి బలమైన పోటీదారు జస్ప్రీత్ బుమ్రా. రోహిత్ శర్మ తన టెస్టు కెరీర్‌లో గడ్డు దశను ఎదుర్కొంటున్నాడు. మెల్బోర్న్ టెస్ట్ తర్వాత, అతను సిడ్నీలో తన చివరి టెస్ట్ ఆడగలడని నివేదికలు పేర్కొన్నాయి. ఇదే జరిగితే బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ప్రస్తుతం అతను జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో రోహిత్ లేనప్పుడు, బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించడంతో భారత జట్టు 295 పరుగుల తేడాతో విజయం సాధించింది.

జనవరి 3 నుంచి సిడ్నీ టెస్టు ప్రారంభం

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జనవరి 3 నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో చివరి టెస్టు జరగనుంది. సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిస్తే సిరీస్ గెలవడంతోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్ టిక్కెట్ కూడా దక్కుతుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో కొనసాగాలంటే, భారత్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. 1978లో ఈ మైదానంలో టీమ్‌ఇండియా చివరిసారిగా టెస్టు గెలిచింది. అప్పటి నుంచి గెలవలేకపోయారు.

Tags:    

Similar News