Sana Ganguly: కోల్‌కతాలో సౌరవ్ గంగూలీ కుమార్తెకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Sana Ganguly: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూతురు సనా గంగూలీ శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.

Update: 2025-01-04 06:32 GMT

Sana Ganguly: కోల్‌కతాలో సౌరవ్ గంగూలీ కుమార్తెకు తృటిలో తప్పిన పెను ప్రమాదం

Sana Ganguly: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూతురు సనా గంగూలీ శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ రోడ్డులో తను ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారును శుక్రవారం బస్సు ఢీకొట్టింది. సనా, ఆమె డ్రైవర్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఢీకొనడంతో కారు అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం తర్వాత బస్సు అక్కడి నుండి వెళ్లిపోయింది. అయితే కారు డ్రైవర్ బస్సును వెంబడించి సఖేర్ మార్కెట్ సమీపంలో ఆపాడు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉందని సనా గంగూలీ తెలిపింది.

కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ రోడ్డులోని బెహలా చౌరస్తా ప్రాంతంలో సాయంత్రం ఈ ఘటన జరిగింది. సౌరవ్ ఇల్లు బెహలాలోనే ఉంది. ఘటన జరిగిన సమయంలో సనా కారులో ఉండగా, ఆమె డ్రైవర్ కారు నడుపుతున్నాడు. ఢీకొన్న తర్వాత బస్సు డ్రైవర్‌ పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఢీకొనడంతో సనా ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా దెబ్బతింది.

సనా గంగూలీ ఎవరు?

సౌరవ్ గంగూలీ అతడి భార్య ప్రఖ్యాత ఒడిస్సీ డ్యాన్సర్ డోనాల ఏకైక సంతానం, సనా గంగూలీ కోల్‌కతాలోని లోరెటో హౌస్‌లో విద్యాభ్యాసం ప్రారంభించింది. యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుండి ఎకనామిక్స్‌లో డిగ్రీని పొందింది. ఆమె లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం ప్రస్తుతం లండన్‌కు చెందిన బోటిక్ కన్సల్టింగ్ సంస్థ INNOVERVలో కన్సల్టెంట్‌గా పని చేస్తోంది. సనా గంగూలీ ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్‌లో కూడా శిక్షణ పొందింది, ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద వృత్తిపరమైన సేవల నెట్‌వర్క్. అంతకు ముందు సనా డెలాయిట్‌లో శిక్షణ తీసుకున్నారు.. గత ఏడాది ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా నిర్వహించిన క్యాండిల్ మార్చ్‌లో సౌరవ్, డోనా, సనా గంగూలీ పాల్గొన్నారు.

Tags:    

Similar News