Yuzvendra Chahal, Dhanashree Verma: ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో.. చాహల్-ధనశ్రీ వర్మ విడిపోతున్నారా?

Update: 2025-01-04 11:17 GMT

Yuzvendra Chahal and Dhanashree Verma divorce news: భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం ఈ వార్తకు మరింత ఆజ్యం పోసినట్టైంది. దీంతో వీరిద్దరూ విడాకుల విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

అంతే కాదు చాహల్ తన ఖాతా నుంచి సతీమణి ఫొటోలను తొలగించాడు. దీంతో వీరిద్దరూ కచ్చితంగా విడిపోతారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే చాహల్‌ను ఇన్‌స్టాలో అన్ ఫాలో చేసినప్పటికీ అతడితో ఉన్న ఫొటోలను మాత్రం ధనశ్రీ తొలగించలేదు. మరోవైపు ఈ జంట విడిపోవడానికి నిర్ణయించుకున్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారని తెలిపాయి. అందుకు కచ్చితమైన కారణాలు మాత్రం చెప్పలేదు. విడాకులు అధికారికం కావడానికి మరికొంత సమయం పట్టొచ్చని పేర్కొన్నారు.

ముంబాయికి చెందిన డెంటిస్ట్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీ వర్మ వద్ద చాహల్ డ్యాన్స్ క్లాసులకు వెళ్లేవాడు. అలా వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. దీంతో 2020 డిసెంబర్ 22న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొరియోగ్రాఫర్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు.

అయితే ఇటీవలే ధనశ్రీ తన పేరు నుంచి చాహల్ పేరును తీసేయడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత చాహల్ సైతం న్యూ లైఫ్ లోడెడ్ అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చాడు. దీంతో వీరు విడాకులు తీసుకోవడం ఖాయం అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత స్పందించిన చాహల్ తాము విడిపోవడం లేదని తెలిపాడు. కానీ తాజాగా భార్య ఫొటోలను తొలగించడంతో పాటు ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో మరోసారి వీరి విడాకుల అంశం నెట్టింట తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విడాకుల వార్తలపై క్లారిటీ రావాలంటే దీనిపై చాహల్, ధనశ్రీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

Tags:    

Similar News