WTC : భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతు.. ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు
WTC : ఆస్ట్రేలియన్ టూర్ టీమ్ ఇండియాకు చాలా దారుణంగా మారింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత జట్టు 1-3 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. సిరీస్‌ను డ్రాగా ముగించాలంటే టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సి ఉంది. కానీ కేవలం 3 రోజుల్లోనే మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ ఓటమి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై కూడా ప్రభావం చూపింది. ఇప్పుడు ఫైనల్ చేరాలన్న టీమిండియా ఆశలన్నీ అడియాసలయ్యాయి.
2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుండి భారత్ ఇప్పుడు నిష్క్రమించింది. రేసులో నిలవాలంటే టీమ్ ఇండియా ఈ సిరీస్‌ని టైగా ముగించాల్సి ఉంది. కానీ అలా చేయడంలో టీం ఇండియా విఫలమైంది. అంటే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో టీమిండియా లేకుండా ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు రెండు సార్లు కూడా భారత జట్టు ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది. కానీ ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో టీమిండియా దారుణంగా విఫలం అయింది. ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌తో భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోయింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ని టీమిండియా వెస్టిండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభించింది. ఈ సిరీస్‌ను భారత జట్టు 1-0తో కైవసం చేసుకుంది. దీని తర్వాత, దక్షిణాఫ్రికాతో ఆడిన 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1 డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో టీమిండియా తలపడింది. ఈ సిరీస్‌లో టీమిండియా 4-1తో విజయం సాధించింది. ఆ తర్వాత 2 టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించింది. కానీ దీని తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 0-3 ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆస్ట్రేలియాపై కూడా ఓడిపోయింది.
టీమ్ ఇండియా నిష్క్రమణతోప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి మ్యాచ్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరగాలని కూడా నిర్ణయించారు. దక్షిణాఫ్రికా ఇప్పటికే ఫైనల్స్‌లో తమ స్థానాన్ని ఖాయం చేసుకోగా ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఫైనల్స్‌కు అర్హత సాధించింది. చివరిసారి ఛాంపియన్‌గా ఆస్ట్రేలియా నిలిచింది.