Ind vs Aus 5th Test : బుమ్రా లేకుండా దారుణంగా భారత బౌలర్ల పరిస్థితి .. సిడ్నీలో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
Ind vs Aus 5th Test : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (2024-25)లో భారత్-ఆస్ట్రేలియా మధ్య చివ, నిర్ణయాత్మక మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (SCG)లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వన్ సైడ్ గా టీమిండియాపై విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్‌ను భారత జట్టు 1-3తో కోల్పోయింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్ ఇండియా విజయంతో ప్రారంభించింది. అయితే దీని తర్వాత భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. దీని కారణంగా సిరీస్‌లో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా లేకుండానే టీమ్‌ఇండియా మైదానంలోకి దిగింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూనే భారీ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించి చరిత్ర సృష్టించింది.
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా 162 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించింది. ఈ చిన్న లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కంగారూ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. యువ ఓపెనర్ శామ్ కాన్‌స్టంట్స్ చెలరేగి బ్యాటింగ్ చేశాడు. అతని అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా ఆస్ట్రేలియా కేవలం 3 ఓవర్లలో 35 పరుగులు చేసింది. టెస్టుల్లో ఏ ఇన్నింగ్స్‌లోనూ తొలి మూడు ఓవర్లలో ఆస్ట్రేలియా సాధించిన అత్యధిక పరుగులు ఇదే. ఈ సమయంలో సామ్ 17 బంతుల్లో 3 ఫోర్ల సహాయంతో 22 పరుగులు చేశాడు.
దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే భారత జట్టు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లోకి ప్రవేశించింది. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో బుమ్రా గాయపడ్డాడు. అనంతరం స్కానింగ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయం కారణంగా, బుమ్రా రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు, కానీ బౌలింగ్ చేయడానికి మైదానంలోకి తిరిగి రాలేకపోయాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 162 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. అంతకు ముందు టీమిండియా రెండో ఇన్నింగ్స్ కేవలం 157 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ మాత్రమే జట్టు మొత్తంలో అత్యధికంగా 61పరుగులు సాధించాడు. దీంతో టీమిండియా గౌరవప్రదమైన స్కోరును అందుకోగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో కూడా అతను అత్యధికంగా 40 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా తరఫున స్కాట్ బోలాండ్ కేవలం 45 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో బౌలాండ్ అత్యధికంగా 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 181 పరుగులకు కుదించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌటైంది.