World Blitz Chess Championship: వరల్డ్ బ్లిట్జ్ ఛాంపియన్ షిప్ లో కాంస్యం.. ఎవరీ వైశాలి?
ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్(World Blitz Championship) లో భారత్ కు చెందిన ఆర్. వైశాలి (R.Vaishali) కాంస్య పతకాన్ని స్వంతం చేసుకున్నారు.
World Blitz Chess Championship: ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్(World Blitz Championship) లో భారత్ కు చెందిన ఆర్. వైశాలి (R.Vaishali) కాంస్య పతకాన్ని స్వంతం చేసుకున్నారు. క్వార్టర్ ఫైన్ లో చైనాకు చెందిన జు జినార్ పై 2.5-1.5 తేడాతో ఆమె గెలిచారు. సెమీస్ లో జు వెంజన్ చేతిలో 0.5-2.5 తేడాతో ఆమె ఓడిపోయారు.
అభినందించిన విశ్వనాథన్ ఆనంద్
ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్ లో వైశాలి కాంస్యం గెలుచుకోవడంపై విశ్వనాథన్ ఆనంద్ ఆమెను అభినందించారు. ఈ పోటీల్లో కాంస్యం గెలుచుకొని దేశానికి గర్వకారణమయ్యారని ఆయన అన్నారు. ర్యాపిడ్ ఈవెంట్ టైటిల్ ను గెలుచుకున్న కోనేరు హంపిని కూడా ఆయన అభినందించారు.
న్యూయార్క్ లో ఆరు రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. ర్యాపిడ్, బ్లిట్జ్ విభాగంలో ఇరిగేశి అర్జున్, ప్రజానంద, రౌనక్ సాధ్వాని, సందీపవన్ చందా, అరవింద్ చిదంబరం, హర్ష భరతకోటి, ప్రణవ్, దీప్తాయన్ ఘోష్, కార్తీక్ వెంకటరాఘవన్ భారత్ నుంచి ఓపెన్ కేటగిరిలో ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇక మహిళల విభాగంలో కోనేరు హంపి, ద్రోణవల్లి హరిక, వైశాలి, వంతిక అగర్వాల్, సాహితి వర్షిణి, పద్మిి రౌత్, దివ్య, నూతక్కి ప్రియాంక హాజరయ్యారు.
ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్ షిప్ పోటీలను రెండు దశల్లో నిర్వహించారు. తొలుత ఓపెన్ విభాగంలో 13 రౌండ్లను స్విస్ ఫార్మాట్ లో నిర్వహించారు. మహిళల విభాగంలో 11 రౌండ్లను స్విస్ ఫార్మాట్ లో ఏర్పాటు చేశారు. రౌండ్లు పూర్తైన తర్వాత టాప్ 8లో నిలిచిన వారే నాకౌట్ కు అర్హత సాధిస్తారు.
నాకౌట్ దశలో గెలిచిన వారే విజేతలు.
ఈ ఫార్మాట్ లో గెలిచిన ఆటగాళ్లకు 76 లక్షలు ప్రైజ్ మనీగా ఇస్తారు. ద్వితీయ బహుమతికి రూ. 59 లక్షలు, తృతీయ బహుమతి కింద 35 లక్షలు అందిస్తారు.ఇకమహిళల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ రూ. 51 లక్షలు, సెకండ్ ప్రైజ్ రూ. 34 లక్షలు, థర్డ్ ప్రైజ్ రూ. 17 లక్షలు ఇస్తారు.
ఎవరీ వైశాలి?
చెన్నైలో 2001 జూన్ 1న వైశాలి జన్మించారు. ఆరేళ్ల వయస్సులోనే ఆమె చెస్ పై ఇష్టం పెంచుకున్నారు. టీవీ చూడకుండా ఉండేందుకు ఆమెకు చెస్ ఆటను పేరేంట్స్ నేర్పించారు. ఈ ఆటలో వైశాలి అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. 2012 లో జరిగిన అండర్ 11 బాలిక జాతీయ ఛాంపియన్ షిప్ లో ఆమె గోల్డ్ మెడల్ సాధించారు. దీంతో ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం వచ్చింది.
2012లో స్లోవేనియాలో అండర్ 11, అండర్ 1 బాలికల జాతీయ చాంపియన్ చెస్ షిప్ లో వైశాలి గోల్డ్ పతకాలు సాధించారు. అదే ఏడాది అండర్ 12 వరల్డ్ చాంపియన్ షిప్ లో కూడా ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. 2015-16 లో ఆమె తన విజయపరంపరను కొనసాగించారు. 2015లో గ్రీస్ లో అండర్ 14 విభాగంలో వరల్్ చెస్ ఛాంపియన్ షిప్ లో కూడా ఆమె స్వర్ణం సాధించారు.