Rohit Sharma: రోహిత్ శర్మపై వేటు.. మూడు వికెట్లను కోల్పోయిన భారత జట్టు !
Rohit Sharma: అనుకున్నదే అయింది రోహిత్ శర్మకు సిడ్నీ టెస్టులో ఆడే అవకాశం రాలేదు. తను ఇప్పటివరకు ఈ పర్యటనలో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. దీని కారణంగా రోహిత్ ను ఆడించకూడదని యాజమాన్యం నిర్ణయించింది. ఇటీవల ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్ గురించి చర్చలు లీక్ అయ్యాయి. అప్పటి నుండి టీమ్ ఇండియాలో ఏం జరుగుతుందో అని అంతా కంగారులో ఉన్నారు అదే సమయంలో రోహిత్ ఫామ్ చూస్తుంటే సిడ్నీ టెస్టు అతని టెస్టు కెరీర్‌లో చివరి మ్యాచ్ కావచ్చని అంతా భావించారు. అయితే గత మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ను తప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ టీమిండియా నుంచి తప్పుకుంటారా అని అంతా ఆలోచిస్తున్నారు.
రోహిత్ ఇకపై టీమ్ ఇండియాకు ఆడలేడా?
టెస్టులో రోహిత్ శర్మ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో 3, 6, 10, 2, 9 పరుగులు చేశాడు. అంటే భారత కెప్టెన్ 5 ఇన్నింగ్స్‌ల్లో 6.20 సగటుతో మొత్తం 31 పరుగులు చేశాడు. దీనితో పాటు తన కెప్టెన్సీ కూడా ప్రశ్నార్థకమైంది, ఎందుకంటే టీమ్ ఇండియా నిరంతర ఓటములను ఎదుర్కొంటోంది. మెల్‌బోర్న్ టెస్ట్ తర్వాత ఇప్పుడు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ కాబోతున్నాడని.. చివరిసారిగా సిడ్నీలో టెస్ట్ ఆడనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ మేనేజ్ మెంట్ రోహిత్‌కి అవకాశం ఇవ్వలేదు.
రోహిత్ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు అతని టెస్ట్ కెరీర్ కూడా దాదాపు ముగిసినట్లే. త్వరలో రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉందని పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా రోహిత్ కేవలం టెస్టులకే రిటైర్ అవుతాడా లేక వన్డేల నుంచి కూడా రిటైర్ అవుతాడా అనేది పెద్ద ప్రశ్న. వచ్చే నెల నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాల్సి ఉంది. అలాంటి పరిస్థితుల్లో రోహిత్ వన్డే ఫార్మాట్ నుండి తప్పుకుంటే అది టీమ్ ఇండియాకు పెద్ద దెబ్బ అని భావించవచ్చు.
రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆడతాడా?
ప్రతి జట్టుకు పెద్ద టోర్నీల్లో అనుభవం అవసరం. రోహిత్ శర్మ ఇప్పటివరకు 2 ఛాంపియన్స్ ట్రోఫీలు కూడా ఆడాడు. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టులో అతను సభ్యుడు. ఇది కాకుండా, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బ్యాటింగులో అద్భుతంగా రాణించాడు. అతను తన చివరి వన్డే సిరీస్‌లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. శ్రీలంక పర్యటనలో 3-మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 52.33 సగటుతో రెండు అర్ధ సెంచరీల సహాయంతో 157 పరుగులు చేశాడు.
సిడ్నీ టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (20) లంచ్ బ్రేక్‌కు ముందు ఔటయ్యాడు. లంచ్ బ్రేక్‌కు ముందు చివరి బంతికి గిల్ తప్పాడు. అప్పటి వరకు నిలకడగా ఆడిన గిల్ (20) నాథన్ లైయన్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చాడు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (4), యశస్వి జైస్వాల్ (10) విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ (12) స్లోగా ఆడుతున్నాడు. రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చినా జట్టు ప్రదర్శనలో పెద్దగా మార్పు కనిపించడం లేదు.
తుది జట్లు:
భారత్: యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, నితీశ్ కుమార్‌రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.
ఆస్ట్రేలియా: సామ్ కొన్‌స్టాస్, ఉస్మాన్ ఖవాజా, లబుషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, వెబ్‌స్టర్, అలెక్స్ గ్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, స్కాట్ బొలాండ్.