SRH Full Squad, IPL 2025: కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసిన కావ్య.. కప్పు పక్కా! ఎస్‌ఆర్‌హెచ్‌ ఫుల్ టీమ్ ఇదే

SRH Full Squad, IPL 2025: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలుచేసింది.

Update: 2024-11-26 02:30 GMT

SRH Full Squad, IPL 2025

SRH Full Squad, IPL 2025: గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్‌) ఓనర్ కావ్య మారన్ చాలా తెలివిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. గతంలో మాదిరి కాకుండా.. పక్కా ప్లానింగ్‌తో ఆటగాళ్లను కొనుగోలు చేశారు. పటిష్ట జట్టుతో ఐపీఎల్ 2024లో బరిలోకి దిగి ఫైనల్ చేరి.. తృటిలో కప్ మిస్ అయ్యారు. అయితే ఈసారి అంతకుమించిన జట్టును కావ్య మేడమ్ నిర్మించుకున్నారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఎస్‌ఆర్‌హెచ్‌ కత్తి లాంటి ఆటగాళ్లను కొనుగోలుచేసింది. ఆ లిస్ట్ ఓసారి చూద్దాం.

ఆదివారం జరిగిన ఐపీఎల్ 2025 తొలి రోజు వేలంలో కావ్య మారన్ దూకుడు కనబర్చారు. వేలంలో ఉత్సాహంగా ఉంటూ.. ప్లాన్ ప్రకారం బిడ్ వేశారు. కావాల్సిన ప్లేయర్స్ కోసం తగ్గేదేలే అనేలా వ్యవహరించారు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ‌ని రూ.10 కోట్లకు సొంతం చేసుకున్నారు. భారత్ పేస్ బౌలర్ హర్షల్ పటేల్‌ను రూ.8 కోట్లకు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు కెప్టెన్ పాట్ కమిన్స్‌కు అండగా ఉండనున్నారు. అలానే ఉప్పల్ మైదానానికి తగ్గట్లుగా స్పిన్నర్లు ఆడమ్ జంపా, రాహుల్ చహర్‌లను కొనుగోలు చేసింది.

టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను రూ.11.25 కోట్ల భారీ ధరకు కావ్య మారన్ సొంతం చేసుకున్నారు. ఇది మంచి మూవ్ అనే చెప్పాలి. నిమిషాల్లో అతడు మ్యాచ్ గమనాన్ని మార్చుతాడు. భారీ హిట్టింగ్ చేసే ఇషాన్ మూడో స్థానంలో ఆడనున్నాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఓపెనర్లుగా ఆడనున్నారు. హెన్రీచ్ క్లాసెన్, నితీష్ రెడ్డికి తోడు అభినవ్ మనోహర్‌, అథర్వ టైడ్‌లను ఎస్‌ఆర్‌హెచ్‌ తీసుకుంది. జయదేవ్ ఉనాద్కత్, కమిందు మెండీస్, జీషాన్ అన్సారీలను తక్కువకే జట్టులో చేర్చుకుంది. అన్ని విభాగాల్లో సన్‌రైజర్స్ పటిష్టంగా కనిపిస్తోంది. ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టును చూసిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి కప్పు పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ లిస్ట్:

హెన్రీచ్ క్లాసెన్ (రూ. 23 కోట్లు)

ప్యాట్ కమిన్స్ (రూ. 18 కోట్లు)

ట్రావిస్ హెడ్ (రూ. 14 కోట్లు)

అభిషేక్ శర్మ (రూ.14 కోట్లు)

నితీష్ కుమార్ రెడ్డి(రూ.6 కోట్లు)

సన్‌రైజర్స్ హైదరాబాద్ వేలంలో కొన్న ప్లేయర్స్ వీరే:

1. మహ్మద్ షమీ: రూ 10 కోట్లు

2. హర్షల్ పటేల్ - రూ 8 కోట్లు

3. ఇషాన్ కిషన్ - రూ 11.25 కోట్లు

4. రాహుల్ చాహర్ - రూ 3.2 కోట్లు

5. ఆడమ్ జంపా - రూ 2.4 కోట్లు

6. అథర్వ తైదే - రూ. 30 లక్షలు

7. అభినవ్ మనోహర్ - రూ 3.2 కోట్లు

8. సిమర్‌జీత్ సింగ్ - రూ 1.5 కోట్లు

9. జీషన్ అన్సారీ - రూ. 40 లక్షలు

10. జయదేవ్ ఉనద్కత్ - రూ. 1 కోటి

11. బ్రైడన్ కార్సే - రూ. 1 కోటి

12. కమిందు మెండిస్ - రూ. 75 లక్షలు

13. అనికేత్ వర్మ - రూ. 30 లక్షలు

14. ఎషాన్ మలింగ - రూ. 1.2 కోట్లు

Tags:    

Similar News