Viral Video: బర్త్‌డే కేక్‌ను ఇలా కూడా కట్ చేస్తారా.? ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు..!

Viral Video: చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. ఎన్ని రకాల శిక్షలు పడుతున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు.

Update: 2024-07-22 11:30 GMT

Viral Video: బర్త్‌డే కేక్‌ను ఇలా కూడా కట్ చేస్తారా.? ఫైర్‌ అవుతోన్న నెటిజన్లు..!

Viral Video: చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. ఎన్ని రకాల శిక్షలు పడుతున్నా కొందరి తీరు మాత్రం మారడం లేదు. చట్ట వ్యతిరేక చర్యలు చేస్తూ రెచ్చిపోతున్నారు. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇదీ మరీ పరాకాష్టకు చేరుకుంది. చట్ట విరుద్ధమని తెలిసినా కొందరు సోషల్‌ మీడియాలో వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే. సాధారణంగా పుట్టిన రోజు వేళ కేక్‌ను దేంతో కట్ చేస్తాం.? అదేం ప్రశ్న ఎవరైనా చాక్‌తోనే కదా కట్ చేసిది అంటారు కదూ! అయితే ఓ ప్రబద్ధుడు మాత్రం ఏకంగా గన్‌తో కేక్‌ను పేల్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఓ యువకుడు పుట్టిన రోజు వేడుకను జరుపుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఒక కేక్‌ను మంచంపై పెట్టారు. అనంతరం కత్తితో కాకుండా ఆ కేక్‌కు గురి పెట్టి కాల్చేశాడు. దీంతో కేక్‌ ఒక్కసారిగా చెల్లాచెదురైపోయింది. దీనతంటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వీడియో కాస్త తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో అటు తిరిగి, ఇటు తిరిగి పోలీసుల కంట పడింది.

దీంతో ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. గన్‌ కల్చర్‌ ఏ రేంజ్‌లో పెరిగిపోతుందో చెప్పేందుకు ఇదే నిదర్శనమని అంటున్నారు. సదరు యువకుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Tags:    

Similar News