Optical Illusion: ఈ ఫొటో మీ రహస్యాలను చెప్పేస్తుంది.. ఎలాగంటే..?

Optical Illusion: మన వ్యక్తిత్వం ఎలాంటిదో మనం ఈ ప్రపంచాన్ని చూసే దృక్కోణంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-09-16 08:45 GMT

Optical Illusion: ఈ ఫొటో మీ రహస్యాలను చెప్పేస్తుంది.. ఎలాగంటే.. 

Optical Illusion: మన వ్యక్తిత్వం ఎలాంటిదో మనం ఈ ప్రపంచాన్ని చూసే దృక్కోణంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మానసిన నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక వస్తువును మనం చూసే విధానం ఆధారంగా మన ఆలోచనలు, మన అభిప్రాయాలు, మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. అందుకే మానసిక నిపుణులు సైతం ఫొటోలను చూపించి వాటి ఆధారంగా మనం ఎలాంటి వాళ్లమో అంచనా వేస్తారు.

అయితే ఒకప్పుడు ఇలాంటి ఫొటోల గురించి అందరికీ తెలిసేవి కావు. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియాలో అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి ఇలాంటి ఫొటోల గురించి ప్రతీ ఒక్కరికీ అవగాహన వస్తోంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న ఆసక్తిర విషయాలు ఎంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

పైన కనిపిస్తున్న ఫొటోలో రెండు వస్తువులు కనిపిస్తున్నాయి కదూ! వీటిలో ఒకటి రెండు వైపులా కొరికిన యాపిల్‌ కాగా.. మరొకటి పక్క నుంచి కనిపిస్తున్న రెండు ముఖాలు. వీటిలో మొదట ఏం కనిపిస్తుందో దానిబట్టి మన వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఈ ఫొటో చూడగానే మొదట మీకు మొదట యాపిల్ కనిపిస్తే.. మీరు మీ జీవితంలో జరిగే వాటిని ఎలా జరిగితే అలా స్వీకరిస్తారు.

జీవితంలో నిత్యం ఆనందాన్ని వెతుక్కుంటారు. ఉన్నదాంట్లో సంతృప్తిగా జీవించాలనే ఆలోచనతో ఉంటారు. చుట్టుపక్కల ఉన్న వారితో నిత్యం మంచి సంబంధాలను కలిగి ఉంటారు. ఇతరులకు అన్నింట్లో అండగా నిలుస్తారు. ఎప్పుడూ మంచి ఆలోచనతో ఉంటారు. నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటారు. ఇతరును సంతోష పర్చాలనే ఆలోచనతో ఉంటారు.

ఇక ఒకవేళ ముఖం చూడగానే మొదట సైడ్‌ ముఖాలు కనిపిస్తే.. మీరు మానవ సంబంధాలకు పెద్ద పీట వేస్తారని అర్థం. ఇతరుల భావోద్వేగాలకు, వారి ఆలోచనలకు పెద్ద పీట వేస్తారు. అయితే ఏదైనా కష్ట వస్తే ఇతరులతో పంచుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. మీలో మీరో మదన పడుతుంటారు. కష్టాన్ని నలుగురితో పంచుకోరు. ఇతరులను ఎందుకు బాధకు గురి చేయాలన్న ఉద్దేశంతో ఉంటారు.

Tags:    

Similar News