Optical illusion: ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది.? దాంతో మీ మనస్తత్వం ఏంటో చెప్పొచ్చు
Optical illusion: ఈ ఫొటోలో మీకేం కనిపిస్తోంది.? దాంతో మీ మనస్తత్వం ఏంటో చెప్పొచ్చు
Optical illusion: మనం ఒక విషయాన్ని ఎలా చూస్తామన్న దాని బట్టే మనం ఎలాంటి వాళ్లమో చెప్పొచ్చని అంటుంటారు. అందుకే మానసిక నిపుణులు సైతం దీన్ని సైంటిఫిక్‌గా చెబుతుంటారు. ఒక దృశ్యాన్ని మనం ఎలా చూస్తామన్న దానిబట్టే మన ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. మన వ్యక్తిత్వం, సమస్యల పట్ల మన ఆలోచన విధానాన్ని దీంతో కనిపెట్టవచ్చు. అలాంటి కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ఇటీవల నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఓ ఫొటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పైన కనిపిస్తున్న ఫొటోలో రెండు అంశాలు దాగి ఉన్నాయి. అందులో ఒకటి ఒక అందమైన అమ్మాయి కాగా, ఒక ముసలి వ్యక్తి. అయితే ఈ ఫొటోను చూసిన వెంటనే మనకు తొలుత ఏం కనిపిస్తోంది అన్న దానిబట్టి మనం ఎలాంటి వాళ్లమో చెప్పొచ్చని నిపుణులు అంటున్నారు. మరి ఈ ఫొటోలో మొదట ఏం కనిపిస్తే.? ఎలాంటి వ్యక్తిత్వమో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఒకవేళ ఈ ఫొటో చూడగానే మీకు మొదట వృద్ధుడు కనిపస్తే.. మీరు జీవితంపై పరిణతి చెందిన వ్యక్తి అని అర్థం. మీ అనుభవాలు సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకునే వ్యక్తిత్వం మీ సొంతం. ఇతరుల ఆలోచనలను, వారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నిస్తుంటారని అర్థం. మీ దృక్పథం వాస్తవికతపై ఆధారపడి ఉంటుంది. సలహాలు, సూచనల కోసం మిమ్మల్ని వ్యక్తులు ఆశ్రయిస్తుంటారు. కష్ట సమయాల్లో మీ ఆలోచనలతో వాటిని పరిష్కరించుకుంటారు.
* ఒకవేళ ఈ ఫొటో చూడగానే మీకు మొదట యువతి ఫొటో కనిపిస్తే.. మీరు దయా గుణంతో ఉంటారని అర్థం. మీరు ఎల్లప్పుడూ ఉత్సాహంతో, ఉత్సుహకతతో ప్రపంచాన్ని చూస్తుంటారు. జీవితంలో చిన్న చిన్న విషయాల్లోనే సంతోషాన్ని వెతుక్కుంటారు. ప్రపంచాన్ని తాజా కళ్లతో చూడగల సామర్థ్యం మీ సొంతం. ఎలాంటి సంక్లిష్టం లేకుండా జీవితాన్ని సాఫీగా సాగించాలనే భావనతో ఉంటారు.