Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయాలి.. ఏ పనులు చేయకూడదు..!
Akshaya Tritiya 2024: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజు అక్ష య తృతీయ వస్తుంది.
Akshaya Tritiya 2024: ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజు అక్ష య తృతీయ వస్తుంది. ఈసారి అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వస్తోంది. ప్రాచీన గ్రంథాల ప్రకారం.. ఈ రోజు చాలా పవిత్రమైనదిగా చెబుతారు. ఈ రోజున ఏ శుభకార్యమైనా చేసుకోవచ్చు. ఎలాంటి ముహూర్తాలు అవసరం లేదు. ఈ రోజు మొదలుపెట్టిన పని కచ్చితంగా విజయవంతం అవుతుందని నమ్మకం. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవిని, కుబేరుడిని పూజించే సంప్రదా యం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీ దేవిని, కుబేరు దేవుడిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో అక్షయ తృతీయ రోజున డబ్బుకు సంబంధించిన కొన్ని చర్యలు తీసుకుంటే మీ లైఫ్ ఎల్లప్పుడు డబ్బుతో నిండి ఉంటుంది. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.
అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవిని పూజించేటప్పుడు గోవులను పసుపు సమర్పించండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోవులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవి. ఆమెకు గోవులను సమర్పిస్తే ఆ వ్యక్తి డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతాడు. అక్షయ తృతీయ రోజున గోవులను పూజించడం వల్ల జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. అలాగే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి.
శ్రీయంత్రాన్ని సురక్షితంగా ఉంచండి
గ్రంథాల్లో, శ్రీ యంత్రం ఆనందం, సంపద, అదృష్టాన్ని ఇచ్చేదిగా చెబుతారు. అక్షయ తృతీయ రోజున శ్రీ యంత్రాన్ని పూజించి భద్రపరచినట్లయితే జీవితంలో ఎప్పుడూ సంపదకు లోటు ఉండదు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టిస్తే చాలా మంచిది. దీనివల్ల మీరు ఆ శంకరుడి అనుగ్రహం పొందుతారు. ఆ వ్యక్తి అన్ని కష్టాల నుంచి విముక్తి అవుతాడు. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడి జీవితం ఆనందంగా ఉంటుంది.
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ రోజున ఆమెకు ఇష్టమైన శంఖాన్ని ఇంటికి తీసుకురావడం వల్ల డబ్బుకు లోటుండదు. ఇంట్లో భద్రపరిచే స్థానంలో ఈ శంఖాన్ని ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది. శంఖాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంటికి తీసుకురావడం వల్ల పేదరికం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అలాగే అక్షయ తృతీయ రోజున మాంసాహారం తినకూడదు. మద్యం తాగకూడదు. ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించాలి.