White Gold: తెల్ల బంగారం అంటే ఏమిటి? తెల్ల బంగారు నగల ధర ఎంత?

White Gold in Telugu: పలాడియం, ప్లాటినం లోహాలను కలపడం వల్ల వైట్ గోల్డ్ స్వచ్ఛమైన వెండిలా మెరుస్తుంది. అయితే, ఈ తెల్ల బంగారంలో ప్రధానంగా ఉండే మూలకం అచ్చమైన పసుపు రంగు బంగారమే. దీన్ని తెల్లగా మెరిసేలా చేసేందుకు ఇతర లోహాలను కలుపుతారు.

Update: 2024-06-23 13:33 GMT

White Gold: తెల్ల బంగారం అంటే ఏమిటి? తెల్ల బంగారు నగల ధర ఎంత?

తెల్ల బంగారం అన్నది సహజమైన లోహం కాదు. అంటే, బంగారంలాగా భూమి నుంచి లభించే లోహం కాదు. వైట్ గోల్డ్ అనేది నిజానికి ఒక రకం అలాయ్ గోల్డ్. అంటే రెండు మూడు లోహాల మిశ్రమంతో తయారయ్యే బంగారం. ఇందులో ఖరీదైన పలాడియం, ప్లాటినం, వెండి వంటి లోహాలతో పాటు కొంత బంగారం కూడా ఉంటుంది.

పలాడియం, ప్లాటినం లోహాలను కలపడం వల్ల వైట్ గోల్డ్ స్వచ్ఛమైన వెండిలా మెరుస్తుంది. అయితే, ఈ తెల్ల బంగారంలో ప్రధానంగా ఉండే మూలకం అచ్చమైన పసుపు రంగు బంగారమే. దీన్ని తెల్లగా మెరిసేలా చేసేందుకు ఇతర లోహాలను కలుపుతారు. ఈ లోహాల మిశ్రమం వల్ల తెల్లదనం మాత్రమే కాకుండా మన్నిక కూడా పెరుగుతుంది. అలాయ్ లోహాలు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. నిజానికి, స్వచ్ఛమైన బంగారు ఆభరణాల తయారీలో కూడా అలాయ్ లోహాల మిశ్రమం ఉంటుంది. ముఖ్యంగా, రోజ్ గోల్డ్ తయారీలో కొంత శాతం అలాయ్ లోహ మిశ్రమం ఉంటుంది.


 రోడియం కోటింగ్ తప్పనిసరి

అలాయ్ లోహాలతో పాటు తెల్ల బంగారానికి రోడియం అనే మరో లోహపు పూత పూస్తారు. స్వచ్ఛమైన బంగారం, ఇతర అలాయ్ లోహాలతో తయారు చేసినప్పటికీ తెల్ల బంగారం కొంత పసుపు రంగుతో కనిపిస్తుంది. అందుకే, దీని మీద రోడియం పూత పూస్తారు. ప్లాటినం లోహ శ్రేణికి చెందిన రోడియం తెల్ల బంగారానికి మెరుపు అద్దుతుంది. అంతేకాదు, ఇది చాలా గట్టి లోహం కాబట్టి గీతలు పడకుండా ఉంటుంది.


తెల్లబంగారం రంగు పోతుందా?

తెల్ల బంగారం కాలక్రమంలో పసుపు బంగారంగా కనిపిస్తుంటుంది. పైన ఉన్న రోడియం పూత పోయినకొద్దీ అది పసుపు రంగులోకి మారుతుంది. తెల్ల బంగారం ఆభరణాలు అన్నీ కూడా కొంత కాలానికి ఇలా పసుపు రంగుతో తేలుతాయి. మీరు చర్మంలోని పీహెచ్ విలువలు బట్టి, మీ ఇంట్లో శుభ్రత కోసం వాడే రసాయనాలను బట్టి వీటి మన్నిక ఆధారపడి ఉంటుంది. అయితే, అందుకు బెంగ పడాల్సిన పని లేదు. నగల షాపు వాళ్ళను అడిగితే వారు మళ్ళీ మీ తెల్ల బంగారు నగలకు రోడియం కోటింగ్ వేసి ఇస్తారు.


 తెల్ల బంగారంలో అసలు బంగారం ఎంత?

వైట్ గోల్డ్ ఆభరణాల్లో అసలు గోల్డ్ ఎంత ఉందో తెలుసుకోవడానికి హాల్ మార్క్ చెక్ చేయాలి. చాలా దేశాల్లో నగ బరువు ఒక గ్రాము దాటితే హాల్‌మార్క్ తప్పనిసరి. ఇక బంగారం విలువను క్యారెట్లలో చూస్తారన్న సంగతి తెలిసిందే. 24 క్యారెట్లు అంటే అది స్వచ్ఛమైన బంగారం అని అర్ధం. అయితే, ఇప్పుడు 9 క్యారెట్ల బంగారం, 18 క్యారెట్ల బంగారం అని కూడా అమ్ముతున్నారు. 9 క్యారెట్ల బంగారంలో 37.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. అదే, 18 క్యారెట్ల బంగారంలో అయితే 75 శాతం ప్యూర్ గోల్డ్ ఉంటుంది. మిగతాదంతా అలాయ్ మిశ్రమం అన్నమాట.

వైట్ గోల్డ్‌తో లాభాలు

- వైట్ గోల్డ్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ప్లాటినం, వెండి లాగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ, దీని ధర మాత్రం ప్లాటినంతో పోల్చితే చాలా తక్కువ. దీని మన్నిక కూడా ఎక్కువ.

- సంప్రదాయ బంగారు వర్ణం ఆభరణాలు కాకుండా తెల్ల రంగు లోహంతో చేసిన నగలు ధరించాలనుకునేవారికి వైట్ గోల్డ్ మంచి ఆప్షన్.

- ఇది తెల్లగా ఉంటుంది కాబట్టి, ఎలాంటి శరీర వర్ణం ఉన్నా బాగా నప్పుతుంది.

తెల్ల బంగారం తో చిక్కులు

- తెల్ల బంగారం అలాయ్ మిశ్రమాలతో తయారై రోడియం పూతతో వస్తుంది కాబట్టి, దీని రంగు కొంత కాలానికి వెలిసిపోతుంది.

- దీనికి ఎప్పటికప్పుడు కోటింగ్ వేయాల్సి వస్తుంది. రీకోటింగ్ అన్నది కొంత ఖర్చుతో కూడుకున్న పని.

ఎంచుకోవాలా వద్దా...

మెరుపులు లేకుండా సింపుల్‌గా అధునాతన డిజైన్లతో ఉన్న ఆభరణాలు కావాలనుకునేవారు వైట్ గోల్డ్ ఆర్నమెంట్స్‌ కోరుకుంటారు.

వెండి వంటి ఇతర తెల్ల రంగు లోహాలతో పోల్చితే దీని డ్యూరబిలిటీ ఎక్కువ. పైగా ప్లాటినం కన్నా దీని ధర చాలా తక్కువ. వైట్ గోల్డ్ ధర 10 గ్రాములకు దాదాపు 5 వేల రూపాయలు ఉంటుంది. అయితే, అది ఎన్ని క్యారెట్ల వైట్ గోల్డ్.. అంటే అందులో స్వచ్ఛమైన బంగారం శాతం ఎంత అనే దానిపై ధాని ధర ఆధారపడి ఉంటుంది. ఇండియాలో ఇంకా వైట్ గోల్డ్ క్రేజ్ పెద్దగా లేకున్నా యూరప్, యూఎస్ వంటి దేశాల్లో వైట్ గోల్డ్‌కు క్రేజ్ బాగా పెరిగింది. దీన్ని మెయింటైన చేయడం సులువు, ధర తక్కువ కాబట్టి యువతరం వైట్ గోల్డ్ ఆభరణాలను ఎంచుకుంటున్నారు.

Full View


Tags:    

Similar News