Senior Citizens: సీనియర్ సిటిజన్లకి హెచ్చరిక.. ఈ లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త..!
Senior Citizens: నేటి కాలంలో బ్యాంకింగ్(Banking) పద్ధతుల్లో పెద్ద మార్పులు వచ్చాయి...
Senior Citizens: నేటి కాలంలో బ్యాంకింగ్(Banking) పద్ధతుల్లో పెద్ద మార్పులు వచ్చాయి. ఈ పరిస్థితిలో ప్రజలు బ్రాంచ్‌కు వెళ్లే బదులు ఆన్‌లైన్ చెల్లింపు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేశంలో క్రెడిట్ కార్డులు(Credit Cards), డెబిట్ కార్డులు(Debit Cards), నెట్ బ్యాంకింగ్(Net Banking) వినియోగం చాలా వేగంగా పెరిగింది. ఈ రోజుల్లో సీనియర్ సిటిజన్లు కూడా ఆన్‌లైన్ మాధ్యమాన్ని ఉపయోగించి డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. కానీ పెరుగుతున్న డిజిటల్ మోడ్ వాడకంతో ఆన్‌లైన్ మోసాల సంఘటనలు కూడా వేగంగా పెరుగుతున్నాయి.
సైబర్ నేరగాళ్లు సీనియర్ సిటిజన్ల(Senior Citizens) ని టార్గెట్ చేసుకొని మోసాలకి పాల్పడుతున్నారు. అందుకే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వంటి డిజిటల్ విధానంలో చెల్లింపులు చేస్తే కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అవసరం. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. పబ్లిక్ నెట్‌వర్క్(Public Network)ని ఎప్పుడూ ఉపయోగించవద్దు. ఈ రోజుల్లో బ్యాంకింగ్ మోసాలకు సంబంధించిన అనేక సంఘటనలు పబ్లిక్ నెట్‌వర్క్ ద్వారా తెరపైకి వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా వ్యక్తుల వ్యక్తిగత డేటాను దొంగిలిస్తున్నారు.
తరువాత బ్యాంకు వివరాల ద్వారా డబ్బులు కాజేస్తున్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు చేస్తున్నప్పుడు, కంప్యూటర్లని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ వ్యక్తిగత సమాచారం హ్యాకర్లకు చేరుతుంది. తర్వాత ఖాతా నుంచి లక్షల రూపాయలు మాయమవుతాయి. ATM నుంచి డబ్బు తీసుకోవడానికి తెలియని వ్యక్తి సహాయం తీసుకోకండి. సీనియర్ సిటిజన్లు ATM నుంచి డబ్బు తీసుకోవడానికి చాలా సార్లు వెళతారు. ఎవరో తెలియని వ్యక్తి సహాయం తీసుకుంటారు.
ఇలా చేయడం మానుకోండి ఎందుకంటే చాలాసార్లు మోసగాళ్లు సహాయం పేరుతో మీ ATM కార్డ్‌ని నకిలీ కార్డుతో భర్తీ చేస్తారు. తర్వాత మీ పిన్ సమాచారం పొంది అందినకాడికి దోచుకుంటారు. బ్యాంక్, వ్యక్తిగత సమాచారాన్ని ఫోన్‌లో షేర్ చేసుకోవద్దు. ఎవరైనా బ్యాంక్ ఖాతా KYC(Know Your Customer) పేరుతో మీకు కాల్ చేసి బ్యాంక్ వివరాలు, వ్యక్తిగత సమాచారం గురించి అడిగితే అతనికి అస్సలు చెప్పకూడదు. బ్యాంకులు ఇలా ఎవరికీ కాల్ చేయవని గుర్తుంచుకోండి.