Amrit Bharat Express: వందే సాధారణ్ స్థానంలో రానున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. తక్కువ ధరతోనే హై క్లాస్ జర్నీ.. తొలి రూట్ ఇదే..!

Amrit Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరహాలో నిర్మించిన వందే ఆర్డినరీ రైలు ఇప్పుడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తున్నారు. వందే భారత్ సెమీ హై స్పీడ్ రైలు భారతీయుల ప్రయాణాన్ని మరింత మెరుగ్గా, వేగంగా చేయడానికి కృషి చేసింది.

Update: 2023-11-26 12:47 GMT

Amrit Bharat Express: వందే సాధారణ్ స్థానంలో రానున్న అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. తక్కువ ధరతోనే హై క్లాస్ జర్నీ.. తొలి రూట్ ఇదే..!

Amrit Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ తరహాలో నిర్మించిన వందే ఆర్డినరీ రైలు ఇప్పుడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తున్నారు. వందే భారత్ సెమీ హై స్పీడ్ రైలు భారతీయుల ప్రయాణాన్ని మరింత మెరుగ్గా, వేగంగా చేయడానికి కృషి చేసింది. ఇప్పుడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వంతు వచ్చింది. ఇది స్లీపర్ క్లాస్‌లో ప్రయాణించే దేశంలోని కార్మికులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇప్పుడు వారు తక్కువ డబ్బుతో వందేభారత్ యాత్రను ఆస్వాదించగలరు. అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ రైళ్ల కంటే 15 శాతం మాత్రమే ఎక్కువ ధర ఉంటుందని చెబుతున్నారు.

ఈ రైలు ప్రత్యేకత ఏంటంటే..

దేశంలోనే తొలి అమృత్ భారత్ రైలు ప్రయాణానికి సిద్ధమైంది. ఈ పుష్ పుల్ రైలు ట్రయల్ పూర్తయింది. ఈ పుష్-పుల్ టెక్నాలజీ సహాయంతో వందే భారత్, EMU రైళ్లు వేగాన్ని అందుకుంటాయి. 22 కోచ్‌లతో కూడిన ఈ రైలు రాజధాని, శతాబ్ది, వందే భారత్‌ తరహాలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడపగలదని రైల్వే అధికారులు తెలిపారు. అమృత్ భారత్ వేగంగా పికప్ తీసుకోగలుగుతుంది. ఈ కుంకుమ రంగు రైలు ఇంజన్ వందే భారత్ లాగా ఉంటుంది. కోచ్ విండో పైన , కింద కుంకుమపువ్వు రంగు గీత ఉంటుంది. స్లీపర్, జనరల్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి.

ఈ రైలు ఎక్కడ నడుస్తుంది?

సమాచారం ప్రకారం దేశంలోనే తొలి అమృత్ భారత్ రెండు మార్గాల్లో ప్రారంభం కానుంది. ఈ రైళ్లు ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో నడవనుంది. దీంతోపాటు దక్షిణాది రాష్ట్రాలు కూడా ఈ సదుపాయాన్ని అందుకోనున్నాయి.

ఈ రైలు వందే భారత్‌కి ఎంత భిన్నంగా ఉంది?

అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వందే భారత్ నుంచి అనేక విధాలుగా భిన్నంగా ఉంటుంది. ఇది 800 కి.మీ కంటే ఎక్కువ దూర ప్రయాణాలకు వినియోగించనున్నారు. అంతేకాకుండా, ఇది పగలు, రాత్రి ప్రయాణాలకు కూడా ఉపయోగపడనుంది. ఇందులో 12 స్లీపర్, 8 అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉంటాయి. అలాగే లగేజీ కోసం 2 కోచ్‌లు ఉంటాయి. ఇందులో 1800 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. రైలులో సీసీటీవీ కెమెరాలు, సెన్సార్ ట్యాప్‌లు, బయో వాక్యూమ్ టాయిలెట్లు, ప్రతి సీటుపై ఛార్జర్లు, ఆధునిక స్విచ్‌లు, ఫ్యాన్లు, ప్రయాణికులకు సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News