Viral Video: రన్నింగ్ కారులో ఏంటిది.? మహిళలు చేసిన పనిపై స్పందించిన పోలీసులు..!

Viral Video: రన్నింగ్ కారులో ఏంటిది.? మహిళలు చేసిన పనిపై స్పందించిన పోలీసులు..!

Update: 2024-07-19 12:00 GMT

Viral Video: రన్నింగ్ కారులో ఏంటిది.? మహిళలు చేసిన పనిపై స్పందించిన పోలీసులు

Viral Video: సోషల్‌ మీడియాలో ఫేమస్‌ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది ఇలాగే ఆలోచిస్తున్నారు. కొందరు ట్యాలెంట్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తుంటే మరికొందరు కాంట్రవర్సీలతో వైరల్‌ అవ్వాలనుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తాజాగా అన్వే కామ్‌దార్‌ అనే 26 ఏళ్ల యువతి జలపాతం వద్ద రీల్స్‌ చేస్తు జారిపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందిన అన్వే కామ్‌దార్‌ అకాల మరణం అందరినీ షాక్‌కి గురి చేసింది. రీల్స్‌కు సంబంధించి మరోసారి చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉంటే తాజాగా ఇలాంటి ఓ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఇద్దరు యువతులు కారులో చేసిన పనికి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఇంతకీ ఆ యువతులు ఏం చేశారో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఘజియాద్‌బాద్‌-ఢిల్లీ నేషనల్‌ హైవే9పై కారు డ్రైవింగ్‌ చేస్తూ వెళ్తున్నారు. ఈ సమయంలో ఓ యువతి కారు నడిపిస్తుండగా మరో యువతి ముందు సీట్లో పక్కన కూర్చుతంది. అయితే ఇదే సమయంలో వీరిద్దరూ ఓ పాటకు డ్యాన్స్‌ చేస్తున్నారు. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న యువతి ఏకంగా స్టీరింగ్‌ను వదిలేసి డ్యాన్స్‌ చేసింది.

దీనతంటినీ వెనకాల కూర్చున్న వారు వీడియో తీశారు. ఈ రీల్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా, తెగ వైరల్‌ అయ్యింది. లైక్స్‌ అయితే వచ్చాయి కానీ దీనిపై నెటిజన్లు మాత్రం ఘాటూగా స్పందిస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ఇలాంటి పనులు చేయడం అవసరమా.? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారి చివరికి పోలీసుల కంట పడింది. దీంతో ఉత్తరప్రదేశ్‌ పోలీసులు దీనిపై స్పందించారు. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా యూపీ పోలీసులు ఘజియాబాద్ పోలీసులను ఆదేశించారు. మరి ఈ యువతులు చేసిన పనికి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 

Tags:    

Similar News