Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌లో కాలు పెడితే.. కచ్చితంగా కళ్లుబైర్లు కమ్మేస్తాయ్.. ఎందుకో తెలుసా?

Indian Railways Facts: ఈ స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు.. రెండు పేర్లు రాసి ఉన్న రైల్వే స్టేషన్‌ను చూసి తికమకపడతారు. అనంతరం అక్కడి స్థానికులను విచారిస్తే అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు.

Update: 2023-05-09 13:30 GMT

Indian Railways: ఈ రైల్వే స్టేషన్‌లో కాలు పెడితే.. కచ్చితంగా కళ్లుబైర్లు కమ్మేస్తాయ్.. ఎందుకో తెలుసా?

Indian Railway Station: రెండు రైల్వే స్టేషన్లు ఒకే ప్రదేశంలో ఉన్నప్పటికీ ఒకే ప్లేస్‌లో ఉండటం ఆశ్చర్యం కలిస్తుందా? అవునండీ.. ఇలాంటి అరుదైన స్టేషన్ కూడా ఒకటి ఉంది. అదికూడా మనదేశంలోనే ఉందండోయ్. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ నగరంలోని శ్రీరాంపూర్, బేలాపూర్ స్టేషన్‌లు ట్రాక్‌కి ఎదురుగా ఒకే చోట ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు సాధారణంగా స్టేషన్లను ఒకే పేరుతో పిలుస్తుంటారు. కానీ, ఇక్కడ ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, రెండు పేర్లు రాసిన ఉన్న రైల్వే స్టేషన్‌ను చూసి కాసేపు గందరగోళానికి గురవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అనంతరం అక్కడి స్థానికులను విచారించగా, ఇవి ఒకే రైల్వే స్టేషన్‌కు చెందిన రెండు పేర్లు అని తేలుతుంది. దీని వెనుక కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ఒకే స్టేషన్‌లో రెండు వేర్వేరు పేర్లతో రెండు స్టేషన్లు..

భారతీయ రైల్వేలు ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్. గణాంకాల ప్రకారం, రైలులో రోజూ ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య ఆస్ట్రేలియా మొత్తం జనాభా కంటే ఎక్కువ. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఒక స్టేషన్‌ చాలా ప్రసిద్ధి చెందింది. టికెట్ కొనే ముందు, రైలు ఏ ప్లాట్‌ఫారమ్‌పైకి వస్తుందో ప్రతి ప్రయాణీకుడు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే శ్రీరామ్‌పూర్, బేలాపూర్ స్టేషన్‌లు ఒకే స్థలంలో ఉన్నాయి. కానీ, రెండు స్టేషన్‌లు ట్రాక్‌కి ఎదురుగా ఉన్నాయి.

రెండు రాష్ట్రాల సరిహద్దులో.. ఒకే రైల్వే స్టేషన్‌..

ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, వారికి లొకేషన్ సమాచారం రావడానికి కొంత సమయం పడుతుంది. అయితే ఇక్కడ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. భారతదేశంలో రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఒకే ఒక స్టేషన్ ఉంది. స్టేషన్‌లో సగం గుజరాత్‌లో ఉండగా, మిగిలిన సగం మహారాష్ట్రలో ఉంది. నవాపూర్ రైల్వే స్టేషన్ గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇక్కడ రైల్వే ప్రయాణీకులకు నాలుగు భాషలలో హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ భాషల్లో వినిపిస్తుంటారు.

Tags:    

Similar News