Top-6 News of the Day: కేంద్ర బడ్జెట్ అమరావతికి రూ. 15 వేల కోట్లు: మరో 5 ముఖ్యాంశాలు

Top-6 News of the Day: కేంద్ర బడ్జెట్ అమరావతికి రూ. 15 వేల కోట్లు: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-07-23 12:47 GMT

Top-6 News of the Day: కేంద్ర బడ్జెట్ అమరావతికి రూ. 15 వేల కోట్లు: మరో 5 ముఖ్యాంశాలు

1.కేంద్ర బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట

కేంద్ర బడ్జెట్ 2024-25 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశ పెట్టారు. వరుసగా ఏడుసార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు నిర్మలా సీతారామన్. రూ. 48.21 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. మొత్తం ఆదాయం రూ. 32.07 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ. 15 వేల కోట్లు కేటాయించారు. అమరావతి కోసం భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.


2. నీట్ మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదు

నీట్ యూజీ-2024 పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. నీట్ ప్రశ్నా పత్రం లీకైనందున ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని దాఖలైన పిటిషన్లపై జూలై 23న ఉన్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. పేపర్ లీక్ తో పరిమిత సంఖ్యలో విద్యార్థులు లబ్దిపొందారని కోర్టు అభిప్రాయపడింది. ఈ కారణంగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.


3. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం: రేవంత్ రెడ్డి

కేంద్ర బడ్జెట్ 2024-25 లో తెలంగాణకు మొండిచేయి చూపారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన కోరారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ మంత్రివర్గం నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. కుర్చీని కాపాడుకొనే బడ్జెట్ గా ఆయన సెటైర్లు వేశారు. ఏపీ పునర్విభజన చట్టమంటే ఏపీ ఒక్కటే కాదు... తెలంగాణ కూడా ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఏపీ, బీహార్ కోసమే బడ్జెట్ పెట్టినట్టుగా ఉందన్నారు.


4. కమలా హారిస్ కు పెరుగుతున్న మద్దతు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేసేందుకు పార్టీలో నాయకుల్లో సగానికి ఎక్కువ మంది తనకు మద్దతిస్తు్న్నారని కమలా హారిస్ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. కమలా హారిస్ కు తన మద్దతును ప్రకటించారు. బైడెన్ ప్రచార బృందంతో కమలా హారిస్ భేటీ అయ్యారు. తనకు మద్దతివ్వాలని ఆమె కోరారు.


5. స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై సీతక్క ఆగ్రహం

దివ్యాంగులపై ఐఎఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు దివ్యాంగులను కించపర్చేలా ఉన్నాయన్నారు. స్మితా సభర్వాల్ తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మంత్రి సూచించారు. వైకల్యం గురించి ఆలోచించే వారికే మానసిక వైకల్యం ఉంటుందన్నారు. ఆలిండియా సర్వీస్ ఉద్యోగులకు దివ్యాంగుల కోటా అవసరమా అని ఆమె ప్రశ్నించారు.


6. వివేకా హత్యపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వైఎస్ వివేకా హత్య చేశారనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగించారు. వివేకా హత్య కేసు అనేక మలుపులు తిరిగిందన్నారు. విచారణాధికారిపై కేసు పెడితే హైకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు కేటాయించడం అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయనే ఆశ కన్పిస్తోందన్నారు. క్లిష్ట సమయంలో ఓటు చీలకూడదనే ఉద్దేశ్యంతో టీడీపీ,జనసేన కలిసి పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Tags:    

Similar News