టాప్-6 న్యూస్ ఆఫ్ ది డే.. ( 13/06/2024 )

టాప్-6 న్యూస్ ఆఫ్ ది డే.. ( 13/06/2024 )

Update: 2024-06-13 14:06 GMT

టాప్-6 న్యూస్ ఆఫ్ ది డే.. ( 13/06/2024 )



1.ఆంధ‌్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు సెక్రటేరియట్ లో 4:41 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. 16వేల టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్‌ కోసం మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారు.



2. తెలంగాణలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ పుస్తకాలను ముందుమాట మార్చకుండా ప్రచురించినట్లు తెలిసింది. అందుకే ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంటోంది.

అజిత్ దోవల్‌

3. అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా ప్రభుత్వం మూడోసారి నియమించింది. కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

వైఎస్ జగన్

4. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో సమావేశమయ్యారు. ప్రజల సమస్యల కోసం పోరాడాలని, అక్రమ కేసులకు భయపడవద్దని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శిశుపాలుడి మాదిరిగానే చంద్రబాబు తప్పులను లెక్కించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో యాత్ర చేయనున్నట్లు ప్రకటించారు.

బీఎస్ యెడియూరప్ప

5. లైంగిక వేధింపుల కేసులో పోక్సో కేసును ఎదుర్కొంటున్న కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యెడియూరప్ప అరెస్ట్‌కు వారంట్ జారీ అయింది. ఆయనను త్వరలో అరెస్ట్ చేసే అవకాశాం ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.



6. ఇకపై ఫోన్ నంబర్ ఫ్రీగా రాదు. ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ నంబర్లకు చార్జి చేయాలని ట్రాయ్ భావిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారుల మీద మోపే అవకాశం ఉంది.

Tags:    

Similar News