వైరల్ వీడియో: అంతమంది ఫాలోవర్స్ ఎందుకో తెలుసా..?
టిక్ టాక్ ఇప్పుడు దాదాపు అన్ని ఫోన్లలో ఉంటున్న ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఇది. ఎవరిని చూసినా సరే టిక్ టాక్ లో వీడియోలు తీయడం పోస్ట్ చేయడం పరిపాటి అయింది.
టిక్ టాక్ ఇప్పుడు దాదాపు అన్ని ఫోన్లలో ఉంటున్న ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఇది. ఎవరిని చూసినా సరే టిక్ టాక్ లో వీడియోలు తీయడం పోస్ట్ చేయడం పరిపాటి అయింది. సమయం, సందర్భం లేకుండా లైక్ ల కోసం, కామెంట్ల కోసం ఏ ప్రాతంలో నైనా సరే వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. ఈ కామెంట్ల కోసం, లైక్ ల కోసం తీసే వీడియోలలో కొంత మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటుంటే, కొంత మంది ప్రమాదాలకు గురవుతున్నారు.
తాము చేసిన వీడియో వైరల్ కావాలని తమ ప్రాణాలకు తెగించి వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయిన వారు ఉన్నారు. గాయాలపాలయిన వారు కూడా ఉన్నారు. అంతే కాదు కొంత మంది ఉద్యోగాలను కూడా కోల్పోయారు. అయినా ఈ టిక్ టాక్ వీడియోల పిచ్చిని మాత్రం కొంతమంది వదులుకోవడం లేదు. అసలు ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు అనుకుంటున్నారా. అయితే పూర్తివివరాల్లోకెళ్దాం.
జాసన్ క్లార్క్ అనే వ్యక్తికి కూడా ఓ టిక్ టాక్ వీడియోలు తీసి పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతను పోస్ట్ చేసిన వీడియోకు ఎక్కువ లైక్ లు రావాలనుకున్నాడో ఏంటో ఓ సాహసం చేసి దాన్ని అప్ లోడ్ చేసాడు. అతడు నీటిలోకి దిగి స్నానం చేసిన వీడియోను పోస్ట్ చేసాడు. దీంతో ఆ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే వైరల్ అయింది. మూడు రోజుల వ్యవధిలోనే ఈ వీడియోనే వేలల్లో కాక ఏకంగా 2.25 లక్షల మందికి పైగా చూశారు.
అసలు స్నానం చేస్తే ఇంత మంది చూస్తారా. స్నానం చేసినా అంత క్రేజ్ లభిస్తుందా? అనుకుంటున్నారా. అవుననే చెప్పుకోవాలి ఎందుకంటే అతను స్నానం చేసిన ప్లేస్ అలాంటిది మరి. అందరి లాగా చలిలో వేడినీల్లు పోసుకుని స్నానం చేస్తే ఏం ఉంటుంది మజా అనుకున్నాడో ఏంటో అతను. తీవ్రమైన చలిలో, గడ్డ కట్టిన నదిలో స్నానం చేశాడు. నదిలో ఉన్న నీరు చలి ప్రభావానికి పూర్తిగా గడ్డగా మారిపోయినప్పటికీ దాన్ని విరగొట్టి అతను నీటిలో దిగాడు. సాధారణ నదిలో స్మిమ్మింగ్ చేసినట్టుగానే అతను కాసేపు నీటి అడుగున ఈత కొట్టాడు. అంతే కాదు ఆ వీడియోను తీసి పోస్ట్ చేసాడు. దీంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది.
ఆ తరువాత అతను ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ సరదాగా గడ్డకట్టిన నదిలో ఈత కొడితే ఎలా ఉంటుందో చూద్దామని ఇలా చేసానని పేర్కొన్నాడు. ముందు ఆ నదిలో దిగగానే ఒక్క సారి తన శరీరమంతా గడ్డకట్టినట్టు అయిందని, తన కను గుడ్లు కూడా గడ్డకట్టేశాయని తెలపారు. ఆ చల్లదనంలో తాను చేసిన రంథ్రం కూడా మరచిపోయానని తెలిపారు. నీటిలో చిక్కుకున్న జాసన్ మరో చోట ఐసుకు రంథ్రం చేసి బయటకు రావాలని ప్రయత్నించానని, కానీ అది సాధ్యం కాలేదన్నారు. దీంతో మళ్లీ ప్రయత్నించి ఎక్కడైతే రంథ్రం చేసుకుని దిగాడో మళ్లీ అక్కడికే వెళ్లి బయటకు వచ్చాడు.
El influencer Jason Clark por poco muere ahogado, tras grabarse para #TikTok nadando durante 40 segundos, debajo de bloques de hielo en el lago Bear Lake. En el video se observa cómo luego de un recorrido exclama que jamás estuvo tan cerca de morir. #InternacionalesTR pic.twitter.com/35NwwgcVQ4
— Telemetro Reporta (@TReporta) February 28, 2020