Viral Post: సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ అయితే మాకొద్దు.. వైరల్ గా మారిన వధువు పెళ్లి ప్రకటన..

Viral Post: అమ్మాయిల కోరికలు ఎలా ఉంటాయో.. ఎవరికీ అర్థం కావంటారు.

Update: 2022-09-22 05:15 GMT

Viral Post: సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ అయితే మాకొద్దు.. వైరల్ గా మారిన వధువు పెళ్లి ప్రకటన..

Viral Post: అమ్మాయిల కోరికలు ఎలా ఉంటాయో.. ఎవరికీ అర్థం కావంటారు. ఎప్పుడు ఏది కావాలంటారో అంత త్వరగా అంతుపట్టదు. ఇక కాబోయే వాడి విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మైండ్‌లో క్లారిటీగా ఫిక్స్ అయిపోతున్నారు. తమకెలాంటి వరుడు కావాలో ముందే డిసైడ్ అయిపోతున్నారు. అలా ఓ అమ్మాయి ఓ మ్యాట్రీమోనల్ సైట్‌ లో తనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న వరుడు గురించి రాసుకొచ్చింది. కానీ చిన్న కండీషన్ పెట్టింది. సాఫ్ట్ వేర్‌ ఇంజినీర్స్‌ మాత్రం ట్రై చేయొద్దని మెన్షన్ చేసింది. అంతే అది కాస్తా వైరల్ అయిపోయింది. అసలు టెకీస్‌ పై అమ్మాయిలు ఏమనుకుంటున్నారు..?

సాఫ్ట్‌వేర్‌ జాబ్. బీటెక్ కంప్లీట్ చేయగానే ఏదో కోర్స్ నేర్చుకుని ఓ కన్సల్టెన్సీ ద్వారా జాబ్ కొట్టేయడం ఆ తర్వాత MNC లో ప్లేస్‌ సాధించడం ఓ కల. అలా అంచెలంచెలుగా ఎదగడం ఐదంకెల జీతాన్ని అందుకోవడం సాఫ్ట్‌వేర్ జాబ్ అంటేనే ఓ క్రేజ్ అంటారు. అయితే ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం సాఫ్‌వేర్ జాబ్‌లపై చెప్పుకోదగ్గ సానుకూల అంశాలేం కనిపించడం లేదు. రీసెంట్‌గా ఓ అమ్మాయి ఓ మ్యాట్రీమోనల్‌ నుంచి వరుడు కోసం ఇచ్చిన ప్రకటనలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ వద్దని ఖరాఖండీగా చెప్పేసింది.

ప్రముఖ బిజినెస్‌మెన్ సమీర్‌ అరోరా తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ మ్యారేజ్‌ ప్రకటనకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను షేర్ చేశాడు. అంతేకాదు ప్రస్తుతం ఐటీ రంగం భవిష్యత్‌ సజావుగా లేదంటూ కామెంట్ చేశారు. దీంతో ఈ ట్వీట్‌ వైరల్ అయిపోయింది. ఇంతకీ ఆ ప్రకటనలో ఏముందంటే ఐఏఎస్ లేదా ఐపీఎస్, పీజీ చేసిన వర్కింగ్ డాక్టర్, ఇండస్ట్రియలిస్ట్, ఏదైనా వ్యాపారం చేసేవాళ్లు సంప్రదించాలని కోరింది. అయితే దాని తర్వాత ఓ బ్రాకెట్‌లో దయచేసి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్స్ మాత్రం కాల్ చేయొద్దని పేర్కొంది. అసలా అమ్మాయి ఎందుకు ఇలాంటి ప్రకటన ఇచ్చిందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. వాస్తవానికి ఒకప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్స్ అంటే యమా క్రేజ్. కట్నకానుకలు భారీగా సమర్పించైనా పెళ్లి చేసుకునేవారు. తన భర్త సాఫ్ట్‌వేర్ అని చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు టైమ్‌ మారిపోయింది. అమ్మాయిల ఆలోచనాధోరణులు మారిపోయాయి.

వర్క్‌ టెన్షన్స్‌, డెడ్‌లైన్‌, టార్గెట్స్‌ ఇలా రకరకాల ఒత్తిడుల మధ్య పనిచేయడం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్స్‌కు సాధారణమే. ఆఫీస్‌లో ఉన్నంత వరకు ఈ ఒత్తిడి భరించాల్సిందే. ఇక వీకెండ్‌కు కేవలం రెండు రోజులు మాత్రమే సెలవులు. దీంతో ఫ్యామిలీకి సరైన సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా కరోనా తర్వాత దాదాపు అన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొవైడ్ చేసింది. దీంతో టెక్కీలంతా ఇంట్లోనే కూర్చొని పనిచేస్తున్నారు. అప్పటి నుంచి వారి మానసిక స్థితిలో చాలా మార్పులు వచ్చాయి. వారి టాలెంట్ అంతా ఇంట్లో వారిపై చూపిస్తున్నారనే ఆరోపణలు చాలా వచ్చాయి. వర్క్ ఫ్రస్టేషన్ అంతా వైఫ్‌ పై చూపిస్తున్నారనే కామన్ పాయింట్ ఆ మధ్య బాగానే సర్క్యూలేట్ అయ్యింది.

బాగా డబ్బులు పోసి సాఫ్ట్‌వేర్‌ను చేసుకున్నా జాబ్‌ గ్యారెంటీ లేదు. ఇలా రకరకాల పాయింట్లు పట్టుకున్న అమ్మాయిలు అసలు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ అంటేనే దూరంగా వెళ్తున్నట్లు ఈ ప్రకటన చూస్తే అర్థం అవుతుంది. అయితే ఈ ప్రకటనపై చాలామంది టెక్కీస్‌ సోషల్ మీడియాలో తమ రియాక్షన్‌ను పంచుకుంటున్నారు. దేశంలో ఎక్కువ మంది సాఫ్‌వేర్ ఇంజనీర్సే ఉన్నారని చెబుతున్నారు. ఒకవేళ ఐటీ ఉద్యోగులు వద్దంటే దేశ భవిష్యత్ కూడా సజావుగా లేనట్టే అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. తాము అంత బ్యాడా అంటూ మరో ఇంజనీర్ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మై గాడ్.. నాకు 11 ఏళ్ల క్రితమే పెళ్లైందంటూ మరో టెక్కీ సెటైరిక్ కామెంట్ చేశాడు.


Tags:    

Similar News