Viral Video: నిద్రపోతున్న యువతిపై పాకిన పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ?

Viral Video: ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో వైరల్‌ అయిపోయింది.

Update: 2024-07-08 11:35 GMT

Viral Video: నిద్రపోతున్న యువతిపై పాకిన పాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ?

Viral Video: ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో వైరల్‌ అయిపోయింది. ఒకప్పుడు సర్వసాధారణంగా చూసిన అంశాలు కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియా ద్వారా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ఇలాంటి వాటిలో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. పాము కనిపించందంటే చాలు జనాలు జేబుల్లో నుంచి ఫోన్‌లు తీసి రికార్డింగ్‌లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సాధారణంగా పామును చూస్తేనే చచ్చెంత భయం వేస్తుంది. అలాంటి పాము శరీరంపై పాకితే.. వామ్మో ఊహకు కూడా అందడం లేదు కదూ! అయితే ఇలాంటి ఓ సంఘటన నిజంగానే జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఓ యువతి ఇంటి ఆవరణలో నిద్రపోతోంది. అదే సమయంలో ఓ పాము సర్రున ఆ యువతి వైపు దూసుకెళ్లింది. ఏకంగా మెడపైకి ఎక్కేసింది. దీంతో పాము మెడపైకి రాగానే ఉలిక్కిపడ్ యువతి లేచి కూర్చుంది. భారీ పామును చూసిన ఆమె అక్కడి నుంచి పరుగులు పెట్టింది.

దీనంతటినీ అక్కడే ఉన్న ఓ వ్యక్తి స్మార్ట్‌ ఫోన్‌లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అయితే ఇక్కడే ఈ వీడియో కొన్ని అనుమానాలకు సైతం దారితీస్తోంది. యువతిపైకి పాము వెళ్తున్న సమయంలో పామును కొట్టాల్సింది పోయి, లేదా సదరు యువతికి చెప్పాల్సింది పోయి ఫోన్‌లో వీడియో తీయడం ఏంటనే చర్చ నడుస్తోంది. ఇది ఎవరో కావాలనే క్రియేట్ చేసిన వీడియోగా కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి ఈ వీడియో చూశాక మీరేమంటారు.? 


Tags:    

Similar News