Redmi 9i: 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో.. అతి తక్కువ బడ్జెట్‌లో.. షియోమి మరొక కొత్త స్మార్ట్‌ఫోన్
Redmi 9i: షియోమి సంస్థ ఇండియాలో బడ్జెట్ ధరలో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. అదే.. రెడ్ మీ 9ఐ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ప్రాథమికంగా గ్లోబల్ రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా వస్తున్న
Redmi 9i: షియోమి సంస్థ ఇండియాలో బడ్జెట్ ధరలో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. అదే.. రెడ్ మీ 9ఐ స్మార్ట్ ఫోన్. ఈ ఫోన్ ప్రాథమికంగా గ్లోబల్ రెడ్‌మి 9A స్మార్ట్‌ఫోన్ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా వస్తున్నది. ఈ బడ్జెట్ ఫోన్ లో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్ప్లే, మీడియా టెక్ హెలియో G25 ప్రాసెసర్ చిప్‌సెట్ వంటి అదిరిపోయే ప్రత్యేకతలతో అందుబాటులోకి రానున్నది.
ప్రత్యేకతలు:
షియోమి ఈ ఫోన్‌లో 6.53 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించింది. మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ను ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా ఇందులో స్టోరేజ్ ను 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఈ ఫోన్ లో 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా.. సెల్ఫీల కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై పోకో ఎం2 పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, ఇందులో 10W ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. వో వైఫై, 4జీ, వోల్టే సపోర్ట్, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్ బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. గైరో సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్‌లు వంటి ప్యూచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,299గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,299గా నిర్ణయించారు. మిడ్ నైట్ బ్లాక్, సీ బ్లూ, నేచర్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఈ నెల 18 నుంచి ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.