Praneeth Hanumanthu: IAS ఆఫీసర్ కొడుకునైనా కష్టాలు పడ్డా.. తమ్ముడి అరెస్ట్‌పై స్పందించిన అజయ్ హనుమంతు
Praneeth Hanumanthu: IAS ఆఫీసర్ కొడుకునైనా కష్టాలు పడ్డా.. తమ్ముడి అరెస్ట్‌పై స్పందించిన అజయ్ హనుమంతు
ఇక హనుమంతు చేసిన వీడియోపై సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు స్పందించారు. హనుమంతు తీరును తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు చేశారు. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే ప్రణీత్ హనుమంతు తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్. అయితే ఇతనికి అజయ్ హనుమంతు అనే ఒక సోదరుడు కూడా ఉన్నాడు. ఇతను కూడా ఒక యూట్యూబర్. అయితే అజయ్ స్టైల్స్‌కి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు.
ఈ క్రమంలోనే తాజాగా తమ్ముడి అరెస్ట్‌పై అజయ్ స్పందించారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని.. అది తమ్ముడైనా సరే శిక్ష పడాల్సిందే అన్నారు. ఇక తనకు వివాహమైన విషయాన్ని అజయ్ తొలిసారి పంచుకున్నారు. ఇలాంటి సందర్భంలో నా పెళ్లి గురించి చెప్పాల్సి వస్తుందని అనుకోలేదన్నారు. కానీ తప్పడం లేదని.. తనకు పెళ్లై ఇప్పటికే ఆరేళ్లయిందని అయే జుడే తెలిపారు. ఇంజినీరింగ్ పూర్తయిన వెంటనే లవ్ మ్యారేజ్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక పెళ్లినాటికి తన పరిస్థితులు వేరన్న అజయ్.. అప్పటికే జీవితంలో చాలా సార్లు ఫెయిలయ్యానని, ఉద్యోగం లేక కష్టాలు పడ్డానని చెప్పుకొచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్ కుమారుడినైనా రోడ్ మీద నుంచే నా లైఫ్ స్టార్ట్ చేశానన్న అజయ్.. అడల్డ్ అండ్ కామెడీని పర్సనల్‌గా తాను ప్రోత్సహించనని, అలాంటివి చూడనని కూడా చెప్పుకొచ్చాడు. అది ఎవరు చేసిన తప్పే. ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉన్నారో.. నేను కూడా అంతే అంటూ తేల్చి చెప్పాడు.