Optical Illusion: గజిబిజీ గందరగోళం.. ఇందులో 'T'ని కనిపెట్టండి చూద్దాం..!
Optical Illusion: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అట్రాక్ట్ చేసే వాటిలో ఫొటో పజిల్స్ ముందు వరుసలో ఉంటాయి.
Optical Illusion: చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ అట్రాక్ట్ చేసే వాటిలో ఫొటో పజిల్స్ ముందు వరుసలో ఉంటాయి. ఒకప్పుడు న్యూస్ పేపర్స్‌కి మాత్రమే పరిమితమైన ఇలాంటి ఫొటో పజిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి వాటికి నెటిజన్లు అట్రాక్ట్ అవుతున్నారు.
ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలతో కూడిన పేజీలను నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటివి రోజుకు వందల సంఖ్యలో వైరల్ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల్లో ప్రధానంగా ఫొటో పజిల్స్ గురించి చెప్పుకోవాలి. చూసే కళ్లను మాయ చేసేలా ఉండే ఈ ఫొటో పజిల్స్‌ను సాల్వ్ చేయడంలో కిక్కు ఓ రేంజ్‌లో ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఏముందో తెలుసుకుందాం.
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏవో లైన్స్ కనిపిస్తున్నట్లు ఉంది కదూ! అంతా గజిబిజీగా గందరగోళంగా ఉంది కదా. అయితే ఇందులో 'T' లెటర్ కూడా దాగి ఉంది. దీనిని కనిపెట్టడమే ఈ ఫొటో పజిల్ ఉద్దేశం. అయితే చూడ్డానికి అన్ని 'T'లాగే కనిపిస్తున్నా అసలైన అక్షరం మాత్రం ఒకటే ఉంది.
ఈ పజిల్‌ను 10 సెకండ్స్‌లో సాల్వ్ చేయగలిగితే మీ ఐ పవర్ సూపర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరెందుకు ఆలస్యం ఓసారి ఈ పజిల్‌ను సాల్వ్ చేయడానికి ప్రయత్నించి చూడండి. ఏంటి ఎంత ప్రయత్నించిన పజిల్ సాల్వ్ చేయలేకపోతున్నారా.? అయితే ఓసారి ఫొటోను సరిగ్గా గమనించండి. కుడి వైపు మధ్యలో 'T' కనిపిస్తుంది. ఎంత ప్రయత్నించినా పజిల్‌ను సాల్వ్ చేయలేకపోతే సమాధానం కోసం ఓసారి కింద చూడండి.