Optical Illusion: మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలని ఉందా.? ఈ ఫొటోలో ఏం కనిపిస్తుందో చెప్పండి..!

Optical Illusion: మనం ప్రపంచాన్ని చూసే విధానంపైనే మన ఆలోచన తీరు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-06-21 09:30 GMT

Optical Illusion: మీరు ఎలాంటి వారో తెలుసుకోవాలని ఉందా.? ఈ ఫొటోలో ఏం కనిపిస్తుందో చెప్పండి..!

Optical Illusion: మనం ప్రపంచాన్ని చూసే విధానంపైనే మన ఆలోచన తీరు ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక వస్తువును ఏ ఇద్దరు ఒకలా చూడరు. మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని చెబుతుంటారు. అందుకే మనుషుల వ్యక్తిత్వాలను వారు వస్తువులను చూసే విధానంగా అంచనా వేస్తుంటారు. ఇందుకోసం కొన్ని రకాల ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలను ఉపయోగిస్తుంటారు.

సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలకు బాగా క్రేజ్‌ పెరిగింది. ఒక ఫొటోను మనం ఏ విధంగా చూస్తున్నాము. మొదట మనకు ఆ ఫొటోలో ఏం కనిపిస్తుంది.? అన్న అంశాల ఆధారంగా మన ఆలోచన ఎలా ఉంది.? మనం ఎలా ఆలోచిస్తున్నాం.? లాంటి వివరాలను చెప్పొచ్చు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటో కూడా ఇలాంటిదే.

పైన ఉన్న ఫొటోను గమనిస్తే ఏం కనిపిస్తోంది. ఏముందు ఒక మొసలి అంటారు కదూ.! అయితే జాగ్రత్తగా గమనిస్తే అందులో ఓ పడవ కూడా ఉంది. గమనించారా.? అయితే మనం తొలుత ఈ ఫొటో చూడగానే మనకు ఏం కనిపించదన్న దానిపై మన ఎలాంటి వాళ్లం, మన వ్యక్తిత్వం ఎలాంటిది.? అన్న విషయాలను అంచనా వేయొచ్చు..

మొసలి కనిపిస్తే..

మీరు ఫొటో చూసిన వెంటనే ఒకవేళ మీకు మొసలి కనిపిస్తే.. మీరు చాలా జోవియల్‌గా ఉంటారని అర్థం. మీరు చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోరు. మీకు అనవసరమైన విషయాల గురించి పెద్దగా పట్టించుకోరు. రిస్క్‌ చేయడానికి పెద్దగా ప్రయత్నించారు. కంఫోర్ట్‌ జోన్‌లో సాఫీగా సాగిపోవాలనే ఆలోచనతో ఉంటారు.

పడవ చూస్తే..

ఒకవేళ ఈ ఫొటో చూడగానే మీకు మొదట పడవ కనిపిస్తే.. మీరు చాలా జాగ్రత్తపరులని అర్థం. ఏదైనా పనిచేసే ముందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తారు. జీవితంలో ప్రతీ చిన్న విషయంపై శ్రద్ధ వహిస్తారు. ప్రపంచాన్ని మీరు చూసే కొణం భిన్నంగా ఉంటుంది. మీలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది.

Tags:    

Similar News