Optical Illusion: ఈ ఫొటోలో కారు సీట్ కనిపిస్తోంది కదూ! సరిగ్గా చూస్తే అసలు విషయం తెలుస్తుంది..!
Optical Illusion: కొన్ని దృశ్యాలు అంతే చూసే కళ్లను కూడా మాయ చేస్తుంటాయి.
Optical Illusion: కొన్ని దృశ్యాలు అంతే చూసే కళ్లను కూడా మాయ చేస్తుంటాయి. సరిగ్గా గమనిస్తే కానీ ఆ ఫొలో ఏముంది అన్న విషయం తెలియదు. వీటినే ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలుగా చెబుతుంటారు. ఇలాంటి ఫొటోల్లో ఉండే మ్యాజిక్ మాములుగా ఉండదు. చూసే కళ్లను మాయ చేసే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలను సాల్వ్ చేయడంలో ఉండే కిక్కు మాములుగా ఉండదు.
అయితే సాధారణంగా ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలను ఫోటో షాప్‌లో ఎడిట్ చేస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో సహజంగా తీసిన ఫొటోలు కూడా కళ్లను మాయ చేస్తుంటాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కెమెరాలో బంధించిన ఫొటోలు కూడా మాయ చేస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఏంటా ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో.? అందులో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటో.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.? ఏముంది.. కారులో సీటు అంటారు కదూ! అయితే జాగ్రత్తగా గమనిస్తే ఈ ఫొటోలో ఒక ట్యాబ్ దాగి ఉంది. ఆ ట్యాబ్‌ను గుర్తించడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ముఖ్య ఉద్దేశం. మరి మీరు ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలరా.? ఇందులో ఉన్న ట్యాబ్‌ను గుర్తించగలరా.? ఓసారి ప్రయత్నించండి. ఏంటి ఎంత ట్రై చేసినా ట్యాబ్‌ను గుర్తించలేకపోతున్నారు. అయితే మీకు ఒక క్లూ ఇస్తున్నాం. ఆ ట్యాబ్‌కి ఉన్న కవర్ అచ్చంగా కారు సీటు రంగును పోలి ఉంది. ఓసారి సీటుకు కుడివైపు చివరిలో గమనించండి. ట్యాబ్ కనిపిస్తుంది. ఇంత చెప్పినా సమాధానం తెలియకపోతే ఓసారి కింది ఫొటోను చూసేయండి.