Optical Illusion: చూడ్డానికి అన్నీ పండ్లు ఒకేలా ఉన్నాయి కదూ! ఒక్కటి మాత్రం తేడా ఉంది, కనిపెట్టండి చూద్దాం..!
ఒకప్పుడు న్యూస్ పేపర్స్‌లో మాత్రమే కనిపించే ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు చూసే కళ్లను సైతం మాయ చేస్తుంటాయి. చూడ్డానికి అంతా నార్మల్‌గానే కనిపిస్తున్నా.. ఏదో ఒక చిన్న తేడా ఉంటుంది. ఆ తేడాను కనిపెట్టడమే సదరు ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు న్యూస్ పేపర్స్‌లో మాత్రమే కనిపించే ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రత్యేకంగా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల కోసం పేజీలను క్రియేట్ చేస్తున్నారు.
అంతేనా.. డిజైనర్స్ సైతం ప్రత్యేకంగా ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలను డిజైన్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీటిని సాల్వ్ చేయమని టార్గెట్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఫొటోలకు నెట్టింట భలే క్రేజ్ కూడా ఉంది. అయితే కేవలం టైమ్ పాస్ కోసం మాత్రమే కాకుండా ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోల ద్వారా చంటి చూపుతో పాటు, ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. తాజాగా అలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పైన ఉన్న ఫొటో చూడగానే ఏం కనిపిస్తోంది.? ఏముంది.. ఆరెంజ్ ఫ్రూట్స్ ఉన్నాయి అంటారు కదా! అయితే చూడ్డానికి అన్ని పండ్లు ఒకేలా ఉన్నా ఒక్క పండు మాత్రం తేడాగా ఉంది. దాన్ని కనిపెట్టడమే ఆ ఆప్టికల్ ఇల్యూజన్ ముఖ్య ఉద్దేశం. అయితే దీన్ని సాల్వ్ చేయడం అంత సులభమైన విషయం మాత్రం కాదు. తేడాగా ఉన్న పండులో కేవలం ఒక చిన్న తేడా మాత్రమే ఉంది. ఓసారి ఫొటోను బాగా గమనిస్తే ఇట్టే కనిపెట్టొచ్చు. ఇంతకీ ఆ ఫొటో గుర్తించారా.? ఎంత వెతికినా సమాధానం దొరకడం లేదా అయితే ఓసారి పై నుంచి నాలుగో వరుసలో ఉన్న చివరి పండును చూడండి తేడా ఇట్టే కనిపిస్తుంది.